టార్గెట్ బీజేపీ:జాతీయ స్థాయిలో మద్దతుకు చంద్రబాబు ప్లాన్

By Nagaraju TFirst Published Oct 6, 2018, 8:08 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ అత్యవసర పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటన, ఐటీ దాడులు, కేసీఆర్ వ్యాఖ్యలపై పార్లమెంటరీ సమావేశంలో వాడీ వేడీగా చర్చించారు. సమావేశంలో బీజేపీ తీరుపై చంద్రబాబు ఎంపీలు ధ్వజమెత్తారు.

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ అత్యవసర పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటన, ఐటీ దాడులు, కేసీఆర్ వ్యాఖ్యలపై పార్లమెంటరీ సమావేశంలో వాడీ వేడీగా చర్చించారు. 

సమావేశంలో బీజేపీ తీరుపై చంద్రబాబు ఎంపీలు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేసిన అన్యాయాన్ని ఎదుర్కోవాలని, పునర్విభజన చట్టాన్ని అమలు చెయ్యలదేన్న విషయాన్ని గ్రహించాలని ఎంపీలకు సూచించారు. 
 
ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టాలన్న చంద్రబాబు భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేయాలన్నారు. తన 36 ఏళ్లుగా టీడీపీ ఇదే రాజకీయ విధానంతో పనిచేస్తోందని వివరించారు. 

మరోవైపు బీజేపీ తెలుగుదేశం పార్టీపైకి ఒంటికాలితో వస్తుందని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీయేతర పార్టీల సహకారం తీసుకోక తప్పదని వెల్లడించారు. డెమోక్రాటిక్ కంపల్సన్ వల్లనే రాజకీయ పొత్తులని ఎంపీలకు వివరించారు.

రాష్ట్రంలో ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని చంద్రబాబు తెలిపారు. పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యలేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని తదనుకుణంగా ఎంపీలు పనిచెయ్యాలని పిలుపునిచ్చారు. 
 
అటు తెలంగాణలో టీడీపీతో పొత్తులేదని బీజేపీనే ఏకపక్షంగా ప్రకటించిందని గుర్తుచేశారు. టీడీపీని బలహీన పర్చే కుట్రకు తెలంగాణలోనే అంకురార్పణ జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌, కేసిఆర్‌లు బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు.  

సమర్థవంతమైన నాయకత్వాన్ని బలహీన పరిచే కుట్ర జరుగుతుందన్నారు. శివసేన, అకాలీదళ్, టీడీపీ అన్నిపార్టీలను బలహీన పర్చేలా బీజేపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. రాజకీయ కోణంలోనే ఐటి దాడులు జరిగినట్లు ప్రజలు భావిస్తున్నారని స్పష్టం చేశారు. దాడులతో భయపెట్టాలనుకోవడం సరికాదన్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో దాడుల తరహాలోనే.. ఏపీలో ఐటీ దాడులు చేస్తున్నారని చెప్పారు.
 
రేవంత్‌రెడ్డి అంశంతో మనకు ముడిపెట్టాలని కుట్రపన్నారని ఎంపీలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. బీజేపీ ఇమేజ్‌ దేశవ్యాప్తంగా బాగా పడిపోయిందన్నారు. నోట్ల రద్దు అట్టర్ ప్లాప్ అయ్యిందని, బ్యాంకులపై ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులకు ఆర్థిక రంగంపై సరైన అవగాహన లేదన్నారు. తాత్కాలిక లాభాల కోసం కక్కుర్తిపడ్డారని చంద్రబాబు ఆరోపించారు. 

click me!