క‌త్తుల‌తో ప‌ర‌స్ప‌ర దాడి.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌యం

Published : Feb 20, 2022, 05:31 AM IST
క‌త్తుల‌తో ప‌ర‌స్ప‌ర దాడి.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌యం

సారాంశం

ఓ రెండు రౌడీ గ్యాంగులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నాయి. అనంతరం ఓ గ్యాంగు సభ్యులు వెల్లి పోలీసు స్టేషనల్ లో లొంగిపోయారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారిని పోలీసులు హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వారంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

రెండు రౌడీమూక‌ల గ్యాంగులు ప‌ర‌స్పరం దాడి చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా మారింది. మ‌రో ఇద్ద‌రికి బ‌లంగా క‌త్తిపోట్లు అయ్యాయి. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్ట‌ణంలోని పాత‌న‌గ‌రంలో చోటు చేసుకుంది. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పాత‌న‌గ‌రంలోని గొల్ల‌వీధి ప్రాంతంలో ఓ రెండు రౌడీ గ్యాంగులు హ‌ల్ చ‌ల్ చేస్తాయి. త‌మ‌కు ఆధిప‌త్యం కావాలంటే త‌మ‌కు ఆధిప‌త్యం కావాలంటూ గొడ‌వ‌లు ప‌డుతుంటాయి. అయితే శ‌నివారం రాత్రి ఈ రెండు గ్యాంగ్ ల మ‌ధ్య స‌రాద‌కు చేసిన ఓ ఆట ప‌ట్టింపు చ‌ర్య అది త‌రువాత తీవ్ర ప‌రిణామానికి దారి తీసింది. gedda santhosh kumarపై పోలీసులు గ‌తంలోనే రౌడీ షీట్ న‌మోదు చేశారు. kona ellaji అనే వ్య‌క్తి మ‌రో రౌడీకి చుట్టం అవుతాడు. అయితే ఈయ‌న minor కుమారుడిని సంతోష్ కుమార్ అనుచ‌రులు స‌ర‌దాకు ఆట ప‌ట్టించారు. దీంతో పాటు ఆ పిల్లాడిపై స్వల్పంగా దాడి చేశారు. ఈ ఆట ప‌ట్టింపు విష‌యం వెళ్లి ఆ పిల్లాడు త‌న తండ్రికి చెప్పాడు. అత‌డు కోపంగా రాత్రి స‌మ‌యంలో ప‌లువ‌రు వ్య‌క్తుల‌ను వెంట తీసుకొని avn colleage స‌మీపంలోకి చేరుకున్నారు.

ఆ ప్రాంతంలో gedda santhosh kumar తో పాటు పలువరు అనుచరులు  kakara prasad (24), arjala naresh (23) తో పాటు మరో ఇద్దరు minors ఉన్నారు అయితే గొడవ ప్రారంభం కాకముందే మైర్లు పారిపోయారు. అనంత‌రం ఈ రెండు గ్యాంగ్ ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయి. క‌త్తుల‌తో దాడులు చేసుకున్నారు. త‌రువాత ఓ గ్యాంగ్ వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయింది. జ‌రిగిన విష‌యం చెప్పారు. పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కి చేరుకున్నారు. గాయాల‌పై ఉన్న పలువురిని పోలీసులు హస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం వారంతా అక్కడ చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కత్తుల దాడులు ఆ ప్రాంతంలో కలకలం రేపాయి. కేసు దర్యాప్తులో  ఉంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?