క‌ర్నూల్ జిల్లాలో విషాదం.. స్కూల్ కు వెళ్లిన బాలుడు ఈత కోసమ‌ని కాలువ‌లో దిగి.. చివ‌ర‌కు

Published : Feb 20, 2022, 03:41 AM IST
క‌ర్నూల్ జిల్లాలో విషాదం.. స్కూల్ కు వెళ్లిన బాలుడు ఈత కోసమ‌ని కాలువ‌లో దిగి.. చివ‌ర‌కు

సారాంశం

స్కూల్ కు వెళ్లిన బాలుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు స్నేహితులతో కలిసి సరదాగా ఈతకొడుదామనుకున్నాడు. అందుకే స్నేహితులతో కలిసి కాలువలో దిగాడు. కానీ ఆ కాలువ ప్రవాహానికి పిల్లాడు కొట్టుకపోయి ఆ గుంతలో పడ్డాడు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆ బాలుడు చనిపోయాడు. 

ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. అందులో ఒక‌రు కూతురు కాగా.. మ‌రొక‌రు కుమారుడు. కుమారుడిని చిన్న‌ప్పుడే శ్వాస కోశ సంబంధిత వ్యాధులు చుట్టుముట్టాయి. తీవ్ర ఆనారోగ్యం పాల‌య్యాడు. పిల్లాడికి ట్రీట్మెంట్ చేస్తేనే బాగ‌వుతాడ‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ట్రీట్మెంట్ కు ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతాయ‌ని అన్నారు.  దీంతో త‌ల్లిదండ్రులు ఆ పిల్లాడిని కాపాడుకోవ‌డానికి ఎంతో తాప‌త్ర‌యప‌డ్డారు. ఎన్నో వ్య‌య ప్రయాస‌ల‌కోర్చి, చివ‌ర‌కు రూ.5 ల‌క్ష‌లు బాకీ తీసుకొచ్చి కుమారుడికి ట్రీట్మెంట్ అందించారు. దీంతో ఆ బాలుడి ఆరోగ్యం బాగ‌య్యింది. 

ఆరోగ్యం మెరుగ‌వ్వ‌డంతో ఆ పిల్లాడు రోజు బ‌డికి వెళ్లి వ‌స్తున్నాడు. పిల్లాడు త‌మ క‌ళ్ల ముందే పెరిగి పెద్ద‌వుతుంటే ఆ త‌ల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు మిగ‌ల‌లేదు. ఓ రోజు స్కూల్ కు వెళ్లిన పిల్లాడు ఇంటికి ప్రాణాల‌తో తిరిగిరాలేదు.  ఈ విష‌యం తెలియ‌డంతో త‌ల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు. ఈ ఘ‌ట‌న క‌ర్నూల్ జిల్లాల్లోని గోనెగండ్ల ప్రాంతంలో శ‌నివారం జ‌రిగింది. 

స్థానికులు పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... గోనెగండ్ల (gonegandla) మండ‌ల ప‌రిధిలోని ఐర‌న్ బండ‌ (iron banda) లో ముల్లా మాబాషా (mulla mabhasha), ఫాతిమా (fathima) దంప‌తులు జీవిస్తున్నారు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు. ఇందులో ఒక‌రు కుమారుడు కాగా మ‌రొక‌రు కుమార్తె. కుమారుడు పేరు సోహెల్ (sohel). వ‌య‌స్సు 12 సంవ‌త్స‌రాలు. అయితే ఆ పిల్లాడిని చిన్న‌ప్పుడు శాస్వ‌కోశ సంబంధిత వ్యాధులు  బాధించాయి. దీంతో త‌ల్లిదండ్రులు ఎంతో ఖ‌ర్చు పెట్టి కుమారుడికి చికిత్స అందించారు. దీంతో ఆ పిల్లాడి ఆరోగ్యం మెరుగ‌య్యింది. అప్ప‌టి నుంచి స్కూల్ కు రెగ్యుల‌ర్ గా వెళ్లి వ‌స్తున్నాడు. 

ప్ర‌స్తుతం సోహెల్ గోనెగండ్ల గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ లో ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఆ పిల్లాడి నివ‌సిస్తున్న ఐర‌న్ బండ నుంచి స్కూల్ కు రెండు కిలో మీట‌ర్ల దూరం ఉంది. ప్ర‌తీ రోజు ఇంటి నుంచి స్కూల్ కు వెళ్లి వ‌స్తుంటాడు. శనివారం కూడా ప్ర‌తీ రోజు లాగే స్కూల్ కు వెళ్లాడు. స్కూల్ అయిపోగానే ఇంటికి తిరిగి వ‌స్తున్నారు. సోహెల్ తో పాటు మ‌రో న‌లుగురు స్నేహితులు ఇంటికి తిరిగి వ‌స్తున్నారు. అయితే వారికి ఇంటికి వచ్చే దారిలో ఎల్ఎల్ సీ కాలువ ఉంటుంది. శ‌నివారం ఇంటికి తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో పిల్ల‌లందరితో క‌లిసి సోహెల్ కూడా ఆ కాలువ‌లో ఈత కొట్టేందుకు దిగాడు. అయితే ఆ కాలువ‌లో ఈత కొడుతున్న స‌మ‌యంలో నీటి ప్ర‌వాహం ఉండ‌టంతో ఆ ఫోర్స్ తో కొట్టుకుపోసాడు.స‌మీపంలో ఓ గుంత ఉండ‌టంతో అందులో ప‌డి మునిగిపోయాడు. ఇది చూసిని మిగితా పిల్ల‌లు గ‌ట్టిగా అరిచారు. దీంతో చుట్టుప‌క్క‌ల పొలాల్లో ప‌ని చేస్తున్న రైతులు, గ్రామానికి చెందిన వ్య‌క్తులు అక్క‌డికి చేరుకున్నారు. ఆ గుంతలోకి దిగి పిల్లాడిని కాపాడేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ చాలా లేట్ అయ్యే స‌రికి సోహెల్ ఊపిర అంద‌క చ‌నిపోయాడు. ఆ పిల్లాడి మృత‌దేహాన్ని ఒడ్డుకి తీసుకొచ్చారు. స్కూల్ కు వెళ్లిన బాలుడు విగిత జీవిగా మార‌డంతో ఆ గ్రామంలో విషాద ఛాయ‌లు నెల‌కొన్నాయి. ఆ త‌ల్లిదండ్రులు రోదించిన తీరు అంద‌రినీ కంట త‌డి పెట్టించాయి. పోలీసులు ఘ‌ట‌న స్థలానికి వ‌చ్చారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?