పాదయాత్ర చేసి తీరతా

First Published Nov 18, 2016, 3:09 AM IST
Highlights

కాపు పాదయ ాత్ర చేసి తీరతాను, పోలీసుల అనుమతి తీసుకునే ప్రసక్తి లేదు : ముద్రగడ

తన నిర్ణయం పై వెనకంజ వేసేదే లేదుపొమ్మంటున్నాడు గృహ నిర్బంధం లో ఉన్న కాపు రిజర్వేషన్  ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం.

 

పాదయాత్ర తేదీ ప్రకటించకపోయినప్పటికీ  సత్యాగ్రహ యాత్ర ను విరమించుకోలేదని ఆయన స్పష్టం చేశారు.   పోలీసుల కొద్ది ఆంక్షలు సడించాక తనను కలుసుకున్న విలేకరులతో ఆయన పాదయాత్ర కొనసాగుతుందని, తొందర్లో ప్రకటిస్తామని చెప్పారు.

 

పోలీసులు కిర్లంపూడి నుంచి వెళ్లిపోయాక, అనుచరులతో మాట్లాడేందుకు కొంత స్వేచ్ఛ దొరికితే  పాదయాత్ర  తేదీని ఖారారు చేస్తానని,  యాత్ర చేసి తీరతానని ఆయన అన్నారు.  13 జిల్లాల జెఎసినాయకులతో చర్చించి ఈ తేదీని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్ని రోజులయిన గృహ నిర్బంధంలో ఉంటానని,  దానికి భయపడేది లేదని ఆయన అన్నారు.

 

అంతేకాదు, పోలీసుల అనుమతి తీసుకునే ప్రసక్తే లేదుపొమన్నారు

 

 శుక్రవారం నాటిటకి ఆయన గృహనిర్భంధం నాలుగో రోజుకు చేరింది. ఆయన కాపు సత్యాగ్రహ పాదయాత్రలో పాల్గొనకుండా చేసేందుకు మంగళవారం నాడు ఆయనను పోలీసులు 48 గంటల పాటు గృహనిర్బంధంలో ఉంచారు. ఆగడువు  గురువారం రాత్రితో ముగిసింది. పలితంగా బ్యారికేడ్లు తొలగించి, విలేకరులు , కొంతమంది దర్శకులు కలిసేందుకు అవకాశమిచ్చారు. పోలీసు బలగాల తిష్ట కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది.  బుధవారం నాడు ముద్రగడను కలిసేందుకు వచ్చిన బంధువులను సైతం ఇంట్లోకి రానీయలేదు.

 

ఆయనతో పాటు గృహనిర్బంధానికి గురైన  కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరుల నిర్బంధాలు గురువారం కూడా కొనసాగాయి.
 

 

 

 

 

 

click me!