
ముద్రగడ పాదయాత్ర మరొక ఉత్కంఠ భరితమయిన నాటకానికి తెరతీయనుంది.
రావులపాలెంతో పాటు రాష్ట్రంలో ఎక్కడ పాదయాత్రలకు అనుమతి లేదని ప్రభుత్వం చెప్పాక కూడా కాపు రిజర్వేషన్ ఉద్యమనేత నవంబర్ 16 న పాదయాత్రకు పూనుకుంటున్నారు. మరొకవైపు అనుమతి లేదని సాకుతతో ఈ పాదయాత్రను నివారించేందుకు పోలీసు ప్రయత్నం చేస్తున్నారు. ఇరువర్గాలు వర్గాలు కయ్యానికి సై అంటూన్నందున ఈ ప్రాంతమంతా ఉద్రిక్తమవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ముద్రగడ ను శాంతిభద్రతల పేరుతో ముందే అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇలాంటి దేదో జరుగుతుందని, ముద్రగడ కూదా ఎత్తుకు పై ఎత్తు వేసేందుకు సిధ్దమవుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
కాపు సత్యగ్రహ యాత్రకు అనుమతి లేదని అధికార పక్ష కాపు నాయకుడు , హోంమంత్రి నిమ్మమకాయల చినరాజప్ప చెప్పారు. శాంతిభద్రతల విషయంలో విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లదన్న గ్యారంటీ లేదని ఆయన చెప్పారు.
’ తుని లో ఏమి జరిగిందో చూశాం. అపుడు కూడా సభని ప్రశాంతంగా నిర్వహించుకుంటామని చెప్పారు. చివరకు ఏమి చేశారు? రత్నాంచల్ ఎక్స్ ప్రెస్ ను , పోలీస్ స్టేషన్, వాహనాలు తగులబెట్టారు,’ అని సోమవారం నాడు హోం మంత్రి కాకినాడలో చెప్పారు.
అయితే, పోలీసులను మొహరిస్తూ ఉండటం, ఈ రోజురాత్రికో రేపు రాత్రికో ముందస్తు అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉన్నందున ముద్రగడ మరొక సారి ’ ఆత్మాహుతి’ అస్త్రం వదిలే అవకాశం ఉందని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు.
గత జూన్ లో కూడా ఇలాగే జరిగింది.కాపుల మీద కేసుల బనాయిస్తూ, అరెస్టుల చేస్తున్నందుకు నిరసనగా జూన్ తొమ్మిదో తేదీన భార్యతో కలసి ముద్రగడ ఇంటిలో నే నిరాహార దీక్షకు పూనుకున్నారు. గదిలోపలినుంచి గొళ్లెం వేసుకుని, చేత పురుగుల మందు సీసా పెట్టుకుని నిరాహార దీక్షని భగ్నం చేసే ప్రయత్నం చేస్తే ఆత్మాహుతి చేసుకుంటానని ఆయన బెదిరించారు. పోలీసులో గదిలో ప్రవేశించలేక, ఆయన నిరాహార దీక్షను అపనూ లేక నానా యాతన పడ్డారు.ఆయన వూరు కిర్లంపూడిలో దాదాపు అయిదు వేల మంది పోలీసులను మొహరించారు. ఒక చిన్న కిటీకి ద్వారా చర్చలు జరిగాయి. ఆయన డాక్టర్లను కూడా అనుమతించలేదు. వైద్య పరీక్షలను నిరాకరించారు. ఒకటిన్నర రోజులు ఈ డ్రామా నడిచింది. మరుసటి రోజు సాయంకాలం పోలీసులు విజయవంతంగా లోపలికి చొరబడి ఆయనను అదుపులోకి తీసుకుని రాజమహేంద్రవరం ఆసుప్రతికి తరలించారు.
ఈ డ్రామా ఇపుడు పునారవృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.