మాదిగలకు మద్దతిచ్చినవారికే ఎమ్మార్పీఎస్ సపోర్ట్ : మందక్రిష్ణ

By SumaBala Bukka  |  First Published Feb 27, 2024, 9:57 AM IST

చలో అమరావతి కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలే కాకుండా అన్ని వర్గాల వారు కూడా వచ్చేలా ప్రయత్నిస్తామని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. 


అమరావతి : ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన వారికే ఎంఆర్పిఎస్ మద్దతిస్తుందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన సమావేశంలో ఈ మేరకు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడారు. మాదిగలకు ఎక్కడ విలువ లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మాలలకే ఇచ్చారని,  ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మాలలకే ఇచ్చారని అన్నారు. వైసిపి ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని.. మాదిగలకు మద్దతిచ్చిన వారికే సపోర్టు చేస్తామని అన్నారు.

తెలంగాణలో ప్రభుత్వం వికలాంగులకు పెన్షన్ 6000 పెంచిందని.. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అదే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇది కుదరకపోతే మార్చి 9వ తేదీన చలో అమరావతి నిర్వహిస్తామన్నారు. ఈ చలో అమరావతి కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలే కాకుండా అన్ని వర్గాల వారు కూడా వచ్చేలా ప్రయత్నిస్తామని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. 

Latest Videos

కల్యాణ్ కు క్యాష్ ట్రాన్సఫర్ అయినా.. బాబు కు కాస్ట్ ఓట్స్ ట్రాన్సఫర్ కావు - అంబటి

వందేళ్ళ క్రితమే మాలల అభివృద్ధికి బీజం పడిందని మందకృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు. మాదిగల కోసం 30 సంవత్సరాల క్రితం బీజం పడిందని, మాలల దగ్గర మాదిగలు ఎప్పుడు వెనుకబడిపోతూనే ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  సుప్రీంకోర్టులో త్వరలోనే ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు వస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, మాదిగలకు మద్దతు ఇచ్చే వారికి…ఆ పార్టీకే ఎంఆర్పిఎస్ సహకరిస్తుందని కూడా అన్నారు. 
 

click me!