చేపల పులుసు ఆరోపణలపై స్పందించిన రోజా.. సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు.. 

Published : Feb 27, 2024, 06:56 AM IST
చేపల పులుసు ఆరోపణలపై స్పందించిన రోజా.. సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు.. 

సారాంశం

Minster RK Roja: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు నగరి ఎమ్మెల్యే  రోజా చేపల పులుసు వండి పెట్టారంటూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తొలిసారి మంత్రి రోజా స్పందించారు. 

Minster RK Roja: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు నగరి ఎమ్మెల్యే  రోజా చేపల పులుసు వండి పెట్టారంటూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తొలిసారి మంత్రి రోజా స్పందించారు. తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి రోజా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ, ఏపీ మధ్యలో కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టుల అప్పగింతపై  వాడీవేడీ చర్చ జరిగిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎం జగన్, కేసీఆర్ కలిసి మంత్రి  రోజా వండిన చేపల పులుసు తిని.. తెలంగాణ వాటా నుంచి నీళ్లను రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను  సీఎం రేవంత్  పలు ప్రస్తావించిన విషయం తెలిసిందే. కాగా .. ఈ వ్యాఖ్యలపై తొలిసారి మంత్రి రోజా ఇలా స్పందించారు.  సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పుడు ఎవరి కోసం చేపల పులుసు చేయలేదని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. జాక్ పాట్‌లో సీఎం అయిన రేవంత్ రెడ్డికి ఏం మాట్లాడాలో తెలియక.. ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారంటూ పెద్ద పంచ్ వేసింది మంత్రి రోజా. 

కాగా.. గతంలోనూ రేవంత్ రెడ్డిపై రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింపిన విషయం తెలిసిందే.. టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు కోవర్టుగానే కాంగ్రెస్‌లోకి వెళ్లారంటూ రేవంత్ రెడ్డిపై సంచలన  ఆరోపణలు చేశారు. గతంలోనూ రేవంత్ రెడ్డి చేపల పులుసు వ్యాఖ్యలు చేయగా.. సీఎం జగన్ తన ఇంటికి ఎప్పుడు వచ్చారో చెప్పాలని నిలదీశారు. ఆయన .. రేవంత్ రెడ్డి కాదని.. కోవర్టు రెడ్డని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసం.. కాంగ్రెస్‌లో చేరారంటూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Lokesh Emotional: చిన్నప్పుడే నాన్న చనిపోయారు..ఈ విద్యార్థిని కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు
Nara Lokesh Speech: గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్