కేంద్రం చూస్తూ ఊరుకోదు.. మూడు రాజధానులపై సుజనా చౌదరి

By telugu team  |  First Published Jan 18, 2020, 2:17 PM IST

13 జిల్లాల అభివృద్ధిపై వైసీపీ దృష్టి సారించాలని సూచించారు. జగన్‌ పాలనపై దృష్టిపెట్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని హితవుపలికారు. రాజధాని అమరావతి కోసం ప్రజా ఉద్యమమే కాదు... న్యాయపరంగానూ ముందుకెళ్తామని బీజేపీ నేత సుజనాచౌదరి స్పష్టం చేశారు.


మూడు రాజధానులపై వైసీపీ ఏకపక్షంగా ముందుకు వెళ్తే.. కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉరుకోదని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. శనివారం ఆయన మూడు రాజధానుల విషయంపై మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఎవరుంటే వారికి ఉద్యోగులు డబ్బా కొడుతున్నారని... అలా చేయడం కరెక్ట్ కాదని సుజనా అభిప్రాయపడ్డారు.

అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు వైసీపీ అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. అమరావతికి కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ప్రజల సొమ్మును వృథా చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. రాజధాని తరలింపు విషయాన్ని వైసీపీ ఉపసంహరించుకోవాలని సూచించారు.

Latest Videos

13 జిల్లాల అభివృద్ధిపై వైసీపీ దృష్టి సారించాలని సూచించారు. జగన్‌ పాలనపై దృష్టిపెట్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని హితవుపలికారు. రాజధాని అమరావతి కోసం ప్రజా ఉద్యమమే కాదు... న్యాయపరంగానూ ముందుకెళ్తామని బీజేపీ నేత సుజనాచౌదరి స్పష్టం చేశారు.

Also Read సెక్స్ చాట్, టాక్ నిషిద్ధమా: పృథ్వీకి మహేష్ కత్తి ఫుల్ సపోర్ట్.
 
అమరావతిలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం పరిశీలిస్తోందని తెలిపారు. అధికార ప్రకటన వెలువడిన తర్వాత కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యతో వైసీపీ ప్రజాప్రతినిధులే సంతోషంగా లేరన్నారు. రాజధాని ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదని సుజన అన్నారు. సీఎం పదవిలో ఎవరున్న ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని సూచించారు. 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చారని, చంద్రబాబుని చూసి కాదని అన్నారు. రాజధాని ఒక్క అంగుళం కూడా జరగదని స్పష్టం చేశారు. అమరావతి తరలింపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తుందని సుజనాచౌదరి ఆందోళన వ్యక్తం చేశారు.  

click me!