పవన్ జీరో అంటూ విజయసాయి ట్వీట్... నాగబాబు కౌంటర్ ‘అదిరింది’

Published : Jan 18, 2020, 01:05 PM IST
పవన్ జీరో అంటూ విజయసాయి ట్వీట్... నాగబాబు కౌంటర్ ‘అదిరింది’

సారాంశం

విజయసాయి రెడ్డితో సోషల్ మీడియా వార్ కి దిగారు మెగా బ్రదర్ నాగబాబు. ఇటీవల పవన్ కళ్యాణ్... బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. కాగా... ఆ విమర్శలకు కౌంటర్లు ఇవ్వడానికి నాగబాబు రంగంలోకి దిగారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో అందరికీ తెలుసు. తమ పార్టీ సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడం కన్నా కూడా... ప్రతిపక్ష పార్టీలను ఏకిపారేయడంలో ఈయన ముందుంటారు. చంద్రబాబు, లోకేష్, పవన్ లను విమర్శించడలో ఈయనకు ఈయనే సరిపాటి.

అయితే... తాజాగా... విజయసాయి రెడ్డితో సోషల్ మీడియా వార్ కి దిగారు మెగా బ్రదర్ నాగబాబు. ఇటీవల పవన్ కళ్యాణ్... బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. కాగా... ఆ విమర్శలకు కౌంటర్లు ఇవ్వడానికి నాగబాబు రంగంలోకి దిగారు.

“గుండు సున్నా దేనితోనైనా కలిసినా, విడిపోయినా ఫలితం జీరోనే. సున్నాను తలపైన ఎత్తుకున్నా, చంకలో పెట్టుకున్నా జరిగేదదే. ఇది పదేపదే నిరూపితమవుతూనే ఉంటుంది. అయినా ప్రయోగాలకు సాహసించే వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. దెబ్బతింటుంటారు. మనం పాపం అనుకుంటూ వదిలేయాలి”.అంటూ విజయసాయి రెడ్డి జనసేనను కించ పరుస్తూ ట్వీట్ చేశారు.

Also Read బీజేపీతో పొత్తు... చాలా క్రియేటీవ్ గా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్...

కాగా... దీనిపై నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘‘ ” జీరో విలువ తెలియని వెధవలకి మనం ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖమ్ వూదినట్లే. ఈ రోజు సైన్స్ అండ్ మాథ్స్ అండ్ కంప్యూటర్స్ ఇంత డెవెలప్ అయ్యాయి అంటే సున్నా మహత్యమేరా చదువుకున్న జ్ఞానం లేని సన్నాసుల్లారా. మంది సొమ్ము మెక్కిన ఎటూ కానీ వెధవ కూడా నీతులు మాట్లాడడమే ..ఖర్మ రా దేవుడా..” అని రాసుకొచ్చారు.

‘‘అదిరింది ద్వారా నాకు జబర్దస్త్ లోటు తీరింది.అంబటి ,పేర్ని,అనిల్,అవంతి,మొదలైన లీడర్స్ వల్ల ఎక్స్ట్రా జబర్దస్ట్ లోటు తీరింది.ఇంకా అదిరింది కామెడీ షో పార్ట్ 2 అవసరం లేదేమో అనిపిస్తోంది.’’ అంటూ వైసీపీ నేతలపై సెటైర్ వేశాడు. కాగా...  నాగబాబు ట్విట్టర్ కౌంటర్లతో జనసేన కార్యకర్తలు సంబరపడిపోతున్నారు. సరైన కౌంటర్లు ఇచ్చారంటూ నాగబాబు ట్వీట్ కి రిప్లై ఇస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu
చంద్రబాబు, పవన్‌పై 420 కేసులు పెట్టాలి: RK Roja Strong Comments on TDP, JSP | Asianet News Telugu