ఎంపిని దూరం పెట్టేసినట్లే

First Published Apr 25, 2017, 4:02 PM IST
Highlights

సమావేశానికి హాజరు కావాల్సిందిగా అసలు ఎంపికి ఆహ్వనమే అందలేదని సమాచారం. అంటే ఇక్కడ మ్యాటర్ క్లియర్. చంద్రబాబే ఎంపిని కావాలనే దూరం పెట్టేసారు.

తెలుగుదేశం పార్టీ ఎంపి శివప్రసాద్ ను దూరంగా పెట్టేసినట్లే. ఇటీవలే పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో ఎంపికి విభేదాలు మొదలైన కారణంగా ఇటు జిల్లా పార్టీతో పాటు రాష్ట్రపార్టీ కూడా ఎంపిని దూరంగా పెట్టేసింది. అందుకనే ఎంపి కూడా చంద్రబాబుపై తిరుగుబాటు ధోరణిలోనే మాట్లాడుతున్నారు. ఎస్సీలకు మంత్రి పదవుల్లోగానీ, ఇతర పథకాల్లోగాని, కేంద్ర మంత్రిపదవుల్లో గానీ చంద్రబాబు పూర్తిగా అన్యాయం చేస్తున్నారంటూ ధ్వజమెత్తటం అందరికీ తెలిసిందే. ఎంపి ఆరోపణలు పార్టీలో కలకలం రేపింది.

అప్పటి నుండి చంద్రబాబు-ఎంపి మధ్య దాదాపు మాటలు లేవు. ఈ నేపధ్యంలోనే జిల్లా వ్యవహారాలు చర్చించేందుకు ఈరోజు జిల్లాలోని ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. దానికి ఎంపి హాజరుకాలేదు. కారణాలన్వేషిస్తే  సమావేశానికి హాజరు కావాల్సిందిగా అసలు ఎంపికి ఆహ్వనమే అందలేదని సమాచారం. అంటే ఇక్కడ మ్యాటర్ క్లియర్. చంద్రబాబే ఎంపిని కావాలనే దూరం పెట్టేసారు.

అదే సమయంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా సమావేశానికి హాజరుకాలేదు. మంత్రివర్గంలో నుండి తనను తప్పించటంపై బొజ్జల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మంత్రివర్గం నుండి తప్పించటంతో ఎంఎల్ఏగా కూడా ఆయన రాజీనామా చేసారు. అయితే, చంద్రబాబు బుజ్జగింపులతో రాజీనామాను వాపసు తీసుకున్నా పార్టీ సమావేశాల్లో దేనికీ హాజరుకావటం లేదు. అందులో భాగంగానే ఈరోజు కూడా గైర్హాజరయ్యారు.

click me!