సీఎం జగన్‌తో సమావేశం కానున్న విశాఖ ఎంపీ, ఆడిటర్ జీవీ.. కిడ్నాప్ ఘటన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత!!

Published : Jun 19, 2023, 01:57 PM IST
సీఎం జగన్‌తో సమావేశం కానున్న విశాఖ ఎంపీ, ఆడిటర్ జీవీ.. కిడ్నాప్ ఘటన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత!!

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీలు కలవనున్నట్టుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీలు కలవనున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం వారు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వారు సీఎం జగన్‌తో సమావేశం కానున్నారు. అయితే తన భార్య, కొడుకుల కిడ్నాప్‌ వ్యవహారం  తర్వాత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. జగన్‌తో సమావేశం కానుండటం ఇదే తొలిసారి. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇక, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, అతని వ్యాపార భాగస్వామి జి వెంకటేశ్వరరావు అలియాస్ జీవీల కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై విపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. భూ దందాల లావాదేవీల్లో తేడాలతో కిడ్నాప్ డ్రామా చోటుచేసుకుందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని.. అప్పుడే అసలైన నిజాలు బయటకు వస్తాయని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు