రూ. 13 లక్షల  కోట్ల పెట్టుబడులు విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో జగన్

By narsimha lodeFirst Published Mar 3, 2023, 2:01 PM IST
Highlights

విశాఖపట్టణం గ్లోబల్ ఇన్వెస్టర్స్  సమ్మిట్ లో  పలు సంస్థలతో  ఒప్పందాలు  చేసుకున్న విషయాన్ని  ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ఇవాళ ,రేపు  విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్  ను  ఏపీ స్రకార్  నిర్వహిస్తుంది.  


విశాఖపట్టణం:ఒక్క ఫోన్ కాల్ తో పారిశ్రామిక వేత్తల   సమస్యలను పరిష్కరించనున్నట్టుగా   ఏపీ సీఎం  వైఎస్ జగన్  తెలిపారు.ఈజ్ ఆప్ డూయింగ్  బిజినెస్ లో   వరుసుగా  ఏపీ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో  నిలిచిన విషయాన్ని సీఎం గుర్తు  చేశారు.  నైపుణ్యాభివృద్ది కాలేజీలతో  పారిశ్రామికాభివృద్ది వైపు సాగుతున్నట్టుగా  సీఎం  చెప్పారు.  భవిష్యత్తులో  గ్రీన్ హైడ్రో  ఎనర్జీలో  ఏపీదే కీలకపాత్ర అని  సీఎం జగన్ తెలిపారు.    రూ. 13 లక్షల  కోట్ల పెట్టుబడులు  పెట్టేందుకు  పలు సంస్థలతో   ఇవాళ ఒప్పందాలు  చేసుకున్నట్టుగా  సీఎం  జగన్  ప్రకటించారు. 

ముఖ్యమైన జీ20 సదస్సుకు  ఏపీ రాష్ట్రం అతిథ్యమివ్వనుందని  ఆయన  చెప్పారు. ఏపీకి  ప్రత్యేకమైన భౌగోళిక  పరిస్థితులున్నాయని  సీఎం జగన్  వివరించారు. రాష్ట్రంలో  ఆరు పోర్టులున్న విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. కొత్తగా  మరో నాలుగు పోర్టులు కూడా రానున్నాయని  ఆయన   తెలిపారు.   ఏపీ కీలక రంగాల్లో  విప్లవాత్మక  సంస్కరణలు తీసుకు వచ్చిందన్నారు.  20 రంగాల్లో  ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా  ముందుకు  సాగుతున్నామని  సీఎం తెలిపారు.  

స్నేహపూర్వక పారిశ్రామిక విధానంతో  ముందుకు వెళ్తున్నట్టుగా  ఆయన  చెప్పారు. ఇవాళ  92 సంస్థలతో  రాష్ట్ర ప్రభుత్వం  ఒప్పందాలు  చేసుకుందన్నారు.  340 సంస్థలు  రాష్ట్రంలో  పెట్టుబడులు  పెట్టేందుకు  ముందుకు  వచ్చినట్టుగా  సీఎం జగన్  ప్రకటించారు.

also read:త్వరలోనే విశాఖ నుండి పాలన: గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో జగన్ 

పెట్టుబడులకే  కాదు  ప్రకృతి  అందాలకు కూడా విశాఖపట్టణం నెలవు అని  సీఎం  చెప్పారు. ఏపీ రాష్ట్రంలో  క్రియాశీలక  ప్రభుత్వం అధికారంలో  ఉందన్పారు . రాష్ట్రంలో  విస్తారంగా  భూమి అందుబాటులో  ఉన్న విషయాన్ని సీఎం  ప్రస్తావించారు.   రాష్ట్రం నుండి ఎగుమతులు  పెరిగినట్టుగా  సీఎం  చెప్పారు.  
 

click me!