హైదరాబాద్ లో 3 రోజుల క్యాంపు ఎందుకు ?

Published : Oct 21, 2017, 06:47 AM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
హైదరాబాద్ లో 3 రోజుల క్యాంపు ఎందుకు ?

సారాంశం

‘రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని సెటిల్’ చేసే ఉద్దేశ్యంతోనే లోకేష్ హైదరాబాద్ లో క్యాంపు వేసారని పార్టీ వర్గాలు సమాధానమిస్తున్నాయ్. తాజాగా ఇరు రాష్ట్రాల్లోని టిడిపిలో రేవంత్ పెట్టిన చిచ్చు అంతా ఇంతా కాదు.  పొలిట్ బ్యూరో సమావేశానికి ముందే రేవంత్ వ్యవహారాన్ని లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి లేకుండా పొలిట్ బ్యూరో సమావేశం జరగటం టిడిపి చరిత్రలో ఇదే మొదటిసారి.

                              నారా లోకేష్ హైదరాబాద్ లో మూడు రోజుల క్యాంపు ఎందుకు వేసారు ?

                              అది కూడా చంద్రబాబునాయుడు దేశంలోని లేని సమయంలో ?

                              ముఖ్యమంత్రి లేకపోతే ఆయన లేని సమయంలో లోకేష్ ఏపిలోనే ఉండాలి కదా?

 

‘రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని సెటిల్’ చేసే ఉద్దేశ్యంతోనే లోకేష్ హైదరాబాద్ లో క్యాంపు వేసారని పార్టీ వర్గాలు సమాధానమిస్తున్నాయ్. తాజాగా ఇరు రాష్ట్రాల్లోని టిడిపిలో రేవంత్ పెట్టిన చిచ్చు అంతా ఇంతా కాదు. వచ్చే ఎన్నికల్లో టిడిపి-టిఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందని పార్టీ నేతల మధ్య జరుగుతున్న చర్చతోనే రేవంత్ రెచ్చిపోతున్నారు. అందుకే కెసిఆర్ తో టచ్ లో ఉన్న ఏపి నేతలు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ ల బండారం రేవంత్ బట్టబయలు చేయటం రెండు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే లోకేష్ హైదరాబాద్ లో ఎందుకు 3 రోజుల పాటు క్యాంపు వేసారన్నదే పెద్ద ప్రశ్న. శుక్రవారం పొలిట్ బ్యూరో సమావేశం జరిగినపుడు రేవంత్ మాటలను బట్టి ఆయన భవిష్యత్ ఏంటో అందరికీ అర్ధమవుతోంది. సమావేశం తర్వాత మీడియాతో మోత్కుపల్లి నరసింహులు, అరవింద్ కుమార్ యాదవ్ మాట్లాడిన తీరు చూస్తుంటే టిడిపి నుండి రేవంత్ ను బయటకు సాగనంపటానికే నిర్ణయం జరిగిందని అర్ధమవుతోంది.

ఉదయం పొలిట్ బ్యూరో సమావేశానికి ముందే రేవంత్ వ్యవహారాన్ని లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి లేకుండా పొలిట్ బ్యూరో సమావేశం జరగటం టిడిపి చరిత్రలో ఇదే మొదటిసారి. చంద్రబాబు ఆదేశాలమేరకే లోకేష్ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. మోత్కుపల్లి, అరవింద్ మాట్లాడిన తీరు కూడా పక్కా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందన్నది సమాచారం.

విదేశాల నుండి చంద్రబాబు తిరిగి వచ్చేంతవరకూ రేవంత్ వ్యవహారం తేలదు. అయితే, రేవంత్ వ్యవహారంలో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తెలంగాణా నేతలతో లోకేష్ నేరుగా మాట్లాడుతున్నట్లు సమాచారం. అందరి అభిప్రాయాలను లోకేష్ ముఖ్యమంత్రికి అందిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయ్. మెజారిటీ నేతలు రేవంత్ ను టిడిపికి దూరంగా పెట్టాలని ఇప్పటికే లోకేష్ కు చెప్పారట. అంటే రేవంత్ విషయంలో లోకేష్ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసినట్లే. కాకపోతే మిగిలింది చంద్రబాబు-రేవంత్ భేటీ మాత్రమే. ఆ లాంఛనం కోసమే టిడిపి నేతలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu