ఆడపిల్ల పుట్టిందని బొంత లక్ష్మి అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో.. మళ్లీ ఆడపిల్లే పుట్టిందన కారణంగా పసికందుకు పాశవికంగా హతమార్చింది. బిడ్డను murder చేసిన తర్వాత ఆరోగ్యం బాగా లేదంటూ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది.
గుంటూరు : గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెలలో దారుణ ఘటన వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే ఆ చిన్నారి పాలిట యమదూతలుగా మారారు. ఆడపిల్ల అనే అసహనం కన్నకడుపు తీపిని చంపేసింది. కర్కశంగా ప్రవర్తించేలా చేసింది. రెండు రోజుల పసిపాపను కన్నతల్లే అత్యంత దారుణంగా చంపేసింది.
ఆడపిల్ల పుట్టిందని బొంత లక్ష్మి అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో.. మళ్లీ ఆడపిల్లే పుట్టిందన కారణంగా పసికందుకు పాశవికంగా హతమార్చింది. బిడ్డను murder చేసిన తర్వాత health బాగా లేదంటూ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. వైద్య సిబ్బంది నిలదీయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై Medical staff పోలీసులకు ఫిర్యాదు చేశారు.
undefined
అమానుషం... కన్నకొడుకును డ్రైనేజీలో విసిరికొట్టిన తల్లి... పసికందు మృతి
పోలీసులు రావడానికి ముందే రాత్రికి రాత్రే పాప Dead bodyని తల్లిదండ్రులు పూడ్చిపెట్టారు. మృతదేహాన్ని వెలికితీసి Postmortem చేయించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కుమార్తెను చంపేసిన దంపతులకు గతంలోనే ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ నవంబర్ 25న హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. రోజుల వయసున్న పసికందును తీసుకుని ఓ అమ్మాయి ఆస్పత్రికి వెళ్లింది. ఆ పసికందుకు తానే తల్లినని చెప్పింది. ఆరోగ్యం బాగోలేదని, చికిత్స చేయమని అడిగింది. అప్పటికే ఆ new born baby మరణించింది. ఆ బాలిక ప్రవర్తన చూసి డాక్టర్లకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఆ బాలిక తనకు పుట్టిన బిడ్డను తనే చంపుకుందని తేలింది. madhyapradesh లోని సాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పదిహేనేళ్లకే ప్రేమ, గర్భం.. పుట్టిన శిశువును ఏం చేయాలో తెలీక.. గొంతుకు తాడు బిగించి..
సాగర్ జిల్లాలోని డహోహ్ ప్రాంతానికి చెందిన 15 యేళ్ల బాలిక అదే ప్రాంతానికి చెందిన 17 యేళ్ల బాలుడితో loveలో పడింది. ఇద్దరికీ మైనార్టీ తీరలేదు. ఏ యేడాది జనవరిలో ఇద్దరూ శారీరకంగా దగ్గర కావడంతో ఆ బాలిక pregnant అయ్యింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బాలుడి మీద అత్యాచారం కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి జువెనైన్ హోమ్ కు తరలించారు. గత నెల 16వ తేదీన బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 22 రోజులు హాస్పిటల్ లో ఉన్న తరువాత ఇంటికి వెళ్లింది.
ఈ నెల 10వ తేదీ రాత్రి తన బిడ్డను తీసుకుని ఆ బాలిక స్థానిక పీహెచ్ సీకి వెళ్లింది. అప్పటికే ఆ పసికందు మరణించింది. వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో ఆ బాలిక తన తప్పును అంగీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను బాలికల జువెనల్ హోంకు తరలించారు.