నెల్లూరులో ఘోర ప్రమాదం : ఆటోను ఢీకొట్టిన లారీ.. వాగులో కొట్టుకుపోయిన ప్రయాణీకులు, గాలింపు

Siva Kodati |  
Published : Dec 09, 2021, 10:07 PM IST
నెల్లూరులో ఘోర ప్రమాదం : ఆటోను ఢీకొట్టిన లారీ.. వాగులో కొట్టుకుపోయిన ప్రయాణీకులు, గాలింపు

సారాంశం

నెల్లూరు (nellore district) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) సంభవించింది. గురువారం సంగం (sangam) వద్ద ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో వాగులో పడిపోయింది.

నెల్లూరు (nellore district) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) సంభవించింది. గురువారం సంగం (sangam) వద్ద ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో వాగులో పడిపోయింది. ఘటన జరిగిన సమయంలో ఆటోలో 15 మంది ఉన్నట్టు సమాచారం. ఆటోలో ఉన్న వారు వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ, ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వాగులో నుంచి ఇప్పటి వరకు నలుగురు ప్రయాణికులను స్థానికులు కాపాడారు. వీరిలో ఓ చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. వాగులో కొట్టుకు పోయిన మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?