
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ వద్ద ఆదివారం 35 ఏళ్ల తల్లి తన ఇద్దరు కుమార్తెలతో సహా స్థానిక నీటి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులను సుకన్య (35), దేవయాని (10), జస్మిత (9)గా గుర్తించారు.
దీనికి సంబంధించి.. ముదిగుబ్బ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదిగుబ్బ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గంగాధర్, సుకన్య నివాసం ఉంటున్నారు. పెళ్లైన నాటినుంచి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరు తరచూ గొడవలు పడుతుండేవారు.
ఈ క్రమంలోనే ఆదివారం కూడా భార్యభర్త మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తరువాత సుకన్య తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమె ఇద్దరు కూతుళ్లతో సహా ముదిగుబ్బ చెరువులోకి దూకింది.
పవన్ ఇరిటేషన్ స్టార్, చంద్రబాబు ఇమిటేషన్ స్టార్.. జగన్ కాలి వెంట్రుక కూడా పీకలేరు: మంత్రి రోజా
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ముదిగుబ్బ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ముగ్గురి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా, పాకిస్తాన్ లో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. వారం వ్యవధిలో రెండు పరువు హత్యల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ తండ్రి తన ఇద్దరు కూతుర్లను గన్ తో కాల్చి చంపాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. ఒక తండ్రి తన ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపిన ఘటన పాకిస్తాన్, పంజాబ్‌లోని కసూర్ జిల్లాలో వెలుగు చూసింది. ఇవి పరువు హత్యలు అని స్థానిక మీడియా నివేదించింది.
సయీద్ అనే వ్యక్తి హవేలీ నథోవాలి ప్రాంతంలో పరువు కోసం తన ఇద్దరు కుమార్తెలపై కాల్పులు జరిపాడు. దీంతో బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తరువాత అక్కడినుంచి తండ్రి పారిపోయాడు. సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇక, ఈ వారం ప్రారంభంలో, పరువు పేరుతో 12 ఏళ్ల బాలుడు తన తల్లిని చంపిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన పాకిస్తాన్ లోని గుజ్రాన్‌వాలా శాటిలైట్ టౌన్ పరిసరాల్లో జరిగిందని తెలుస్తోంది. ఏఆర్వై న్యూస్ ప్రకారం, మృతురాలు వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా, బాలుడు ఆమెపై కాల్పులు జరిపాడని, అతని అత్తగా గుర్తించబడిన మరో మహిళకు గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బాలుడు హత్యను అంగీకరించాడు. తరువాత అతడిని పోలీసులు అరెస్టు చేశారు.