జగన్ అపాయింట్ మెంట్: రఘురామ కృష్ణమరాజుకు మోపిదేవి కౌంటర్

Published : Jun 26, 2020, 11:27 AM ISTUpdated : Jun 26, 2020, 11:28 AM IST
జగన్ అపాయింట్ మెంట్: రఘురామ కృష్ణమరాజుకు మోపిదేవి కౌంటర్

సారాంశం

తమ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మంత్రి మోపిదేవి వెంకటరమణ కౌంటర్ ఇచ్చారు. ఎంతటివారైనా సహించేది లేదని చెప్పారు.

విశాఖపట్నం: ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ అపాయింట్ మెంట్ దొరకడం లేదనే పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమరాజు వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ కౌంటర్ ఇచ్చారు. పని ఒత్తిడి వల్ల జగన్ అపాయింట్ మెంట్ దొరికి ఉండకపోవచ్చునని ఆయన అన్నారు. 

అయితే, జగన్ అందరికీ అందుబాటులో ఉంటారని ఆయన శుక్రవారం చెప్పారు. మోపిదేవి వెంకటరమణ శుక్రవారం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతటివారైనా పార్టీకి విధేయులుగా ఉండాల్సిందేనని, ఈ విషయంలో సరిగా లేరు కాబట్టే రఘురామకృష్ణమ రాజుకు నోటీసులు జారీ అయ్యాయని ఆయన అన్నారు. 

Also Read: రఘురామ కృష్ణమరాజు వ్యూహం ఇదే: వైఎస్ జగన్ టార్గెట్

తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఒక్క మాట కూడా అనలేదని రఘురామకృష్ణమరాజు అన్నారు. అయితే, తనకు జగన్ అపాయింట్ మెంట్ దొరకడం లేదని ఆయన చెప్పారు. అలా అంటూనే ఆయన తనకు జారీ అయిన నోటీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి జారీ చేసిన నోటీసు తనకు వర్తించదని ఆయన చెప్పారు. వైసీపీ తనకు ఇచ్చిన నోటీసుకు చట్టబద్దత లేదని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయి పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. విమర్శలపై వారం రోజుల లోపల వివరణ ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు ఈ నెల 24వ తేదీన రఘురామకృష్ణమ రాజుకు నోటీసులు జారీ చేశారు.

Also Read: విజయసాయి రెడ్డి నోటీసుకు మెలిక పెట్టిన ఎంపీ రఘురామకృష్ణంరాజు

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu