ఏపీలో మోదీ పర్యటన : అర్థాంతరంగా వెనుదిరిగిన రఘురామకృష్ణంరాజు.. ఏ జాబితాలోనూ రఘురామ పేరు లేదన్న డీఐజీ

By SumaBala BukkaFirst Published Jul 4, 2022, 7:26 AM IST
Highlights

సోమవారం ఏపీలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా తనకు అనుమతినివ్వాలని కోరిన రఘరామకృష్ణంరాజు తన ప్రయాణాన్ని అర్థాంతరంగా ముగించారు. ఏపీ పోలీసులు వెంబడిస్తున్నారనే ఇలా చేశారని తెలుస్తోంది.

భీమవరం : ఏపీలో ప్రధాని పర్యటన సందర్భంగా.. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో గానీ.. వేదికపై ఉండే వారి జాబితాలో గానీ... హెలిప్యాడ్ దగ్గర ప్రధానిని ఆహ్వానించే వారి జాబితాలో గాని నరసాపురం ఎంపీ కనుమూరి ragurama krishnamraju పేరు ఎక్కడా లేదని ఏలూరు రేంజి డిఐజి పాలరాజు తెలిపారు.  పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విషయంలో తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. ప్రధాని కార్యక్రమానికి రఘురామ ఎలా వస్తున్నారో తమకు తెలియదని వెల్లడించారు. రఘురామ సెల్ఫోన్ నెంబర్ను పోలీస్ శాఖ బ్లాక్లిస్టులో పెట్టలేదని వివరించారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఏపీలో ఫ్లయంగ్ జోన్ కు సంబంధించి ఆంక్షలు ఉంటాయని అన్నారు. అందుకే ఎవరైనా వాయుమార్గంలో రావాలంటే నిబంధనల ప్రకారం నడుచుకోవాలని.. ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని తెలిపారు. 

కాగా, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బయలుదేరిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆదివారం రాత్రి మధ్యలోనే అర్ధాంతరంగా  వెనుదిరిగారు. తనను ఏపీ పోలీసులు అనుసరిస్తూ ఉండటంతోనే ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్ లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి నరసాపూర్ ఎక్స్ప్రెస్ లో రఘురామ కృష్ణంరాజు  తన అనుచరులతో కలిసి భీమవరం బయలుదేరారు. అంతలోనే ఏపీ పోలీసులు తనను  వెంబడిస్తున్నారని ఆయన హైదరాబాదులోని బేగంపేట రైల్వే స్టేషన్కు వచ్చేసరికి అక్కడ రైలు దిగిపోయారు. తన అనుచరులు  కొందరి మీద ఇప్పటికే పలు కేసులు ఉండడంతో వారిని మరింత ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పర్యటనను రద్దు చేసుకున్నట్లు  తెలిపారు. అందుకే ఆయన తిరిగి వెళ్ళిపోయారు అని చెబుతున్నారు.

హైద్రాబాద్‌లో రఘురామ కేసుల విచారణ: ఏపీ హైకోర్టు సీఐడీకి గ్రీన్ సిగ్నల్

ఇదిలా ఉండగా, జూలై 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ నెల 4న భీమవరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా.. హాజరయ్యేందుకు తనకు రక్షణ కల్పించాలని రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, ఈ పిటిషన్ మీద విచారించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. ‘ఎంపీగా మీరు పర్యటనకు వెళ్లవచ్చు కదా’ అని ధర్మాసనం రఘురామ తరఫు లాయర్ ఉమేష్ చంద్రను ప్రశ్నించింది. రఘురామ తరఫు లాయర్ దీనికి సమాధానంగా ... ఏదో ఒక కేసు పెట్టి తన క్లయింట్ ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారని కోర్టుకు తెలిపారు. తన క్లయింట్ మీద ఎలాంటి కేసులు లేకుండా రక్షణ కల్పించాలని.. భీమవరం వెళ్లేందుకు అనుమతించాలని కోర్టును కోరిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మే 3న ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వరుసపెట్టి జరుగుతున్న హత్యలు, అత్యాచారలపై మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల మీద కీలక వ్యాఖ్యాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు హత్యలు, ఆరు మానభంగాలు అని చెబుతోంటే బాదేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లేని చట్టాల గురించి తమ పారట్ీ నేతలు మాట్లాడతారంటూ రఘురామ చురకలంటిచారు. ఏపీలో ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడిస్తోందని ఆయన దుయ్యబట్టారు. 

click me!