చంద్రబాబుకు మోడి దిమ్మతిరిగే షాక్

First Published Feb 11, 2018, 10:04 AM IST
Highlights
  • ఏపికి కేంద్రం చేసిన సాయంపై ఇంతకాలం మౌనంగా ఉన్న మోడి రాష్ట్రంలోని బిజెపి నేతల ద్వారానే చంద్రబాబు గాలి తీసేస్తున్నారు.

చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి దిమ్మతిరిగేలా పెద్ద షాకే ఇచ్చారు. ఏపికి కేంద్రం చేసిన సాయంపై ఇంతకాలం మౌనంగా ఉన్న మోడి రాష్ట్రంలోని బిజెపి నేతల ద్వారానే చంద్రబాబు గాలి తీసేస్తున్నారు. బిజెపిలో ఉంటూ చంద్రబాబుకు ప్రధాన మద్దతుదారుగా నిలుస్తున్న హరిబాబు చేతే టిడిపికి కౌంటర్ ఇప్పించారు. ఇంతకాలం బిజెపి నేతల్లో ఎంఎల్సీ సోము వీర్రాజు మాత్రమే చంద్రబాబుపై ఒంటికాలిపై లేచేవారు. ఇపుడు వీర్రాజుకు జతగా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును స్వయంగా మోడి, అమిత్ షాలు రంగంలోకి దింపారు. ఈ పరిణామాన్ని చంద్రబాబు ఏమాత్రం ఊహించలేదు.

బడ్జెట్ నేపధ్యంలో టిడిపి ఎంపిలు పార్లమెంటులో చేస్తున్న పోరాటమంతా కేవలం అసెంబ్లీ సీట్ల పెంపుకోసమే అంటూ చంద్రబాబు గాలి తీసేసారు వీర్రాజు. చంద్రబాబు అడుగుతున్నట్లుగా మోడి గనుక అసెంబ్లీ సీట్లను 175 నుండి 225కి పెంచుంటే టిడిపి ఇపుడీ గోల  చేసేదే కాదని వీర్రాజు ఇచ్చిన కౌంటర్ కు టిడిపి నేతలు నోరెత్తటం లేదు. అదే విధంగా బిజెపితో పొత్తు కొనసాగే విషయంలో టిడిపిదే అంతిమ నిర్ణయమంటూ హరిబాబు చేసిన పరోక్ష వ్యాఖ్యలు కూడా చంద్రబాబు ఏమాత్రం ఊహించలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నట్లు జివిఎల్ నరసింహారావు చంద్రబాబుపై మండిపడ్డారు.

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు టిడిపికి చెందిన కేంద్ర సహాయమంత్రి సుజనా చౌదరి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధితో చర్చలు జరపటంపై వీర్రాజు అడిగిన ప్రశ్నలకు టిడిపి నుండి సమాధానం లేదు. బిజెపిని ముంచాలని చూస్తే టిడిపి కూడా ముణిగిపోవటం ఖాయమని కన్నా లక్ష్మీనారాయణ వేసిన కౌంటర్ కు టిడిపి నేతలెవరూ ఇంత వరకూ సమాధానం చెప్పలేదు.

వెనకబడిన జిల్లాలకిచ్చిన రూ. 900 కోట్లు ఏమయ్యాయంటూ బిజెపి చంద్రబాబును నిలదీసింది. తీసుకున్న నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పకపోతే మళ్ళీ నిధులెలా ఇస్తారంటూ బిజెపి అడిగిన ప్రశ్నకు టిడిపి నుండి సమాధానం లేదు. కేంద్రంలో అధికారం అనుభవిస్తూ పార్లమెంటులో నిరసనలు ఎలా చేస్తారంటూ బిజెపి వేసిన ఘాటు ప్రశ్నకు చంద్రబాబు వద్ద సమాధానమే లేదు.

 

click me!