అడ్డుకుంటే ప్రభుత్వం ఉండదు: చంద్రబాబుకు జీవీఎల్ వార్నింగ్

Published : Feb 09, 2019, 12:35 PM IST
అడ్డుకుంటే ప్రభుత్వం ఉండదు: చంద్రబాబుకు జీవీఎల్ వార్నింగ్

సారాంశం

రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందనే లెక్కలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ చెబుతారని జీవీఎల్ శనివారం మీడియాతో అన్నారు. మోడీ పర్యటనపై ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై తెలుగుదేశం, బిజెపిల మధ్య అగ్గి రాజుకుంటోంది. మంత్రులకు, ముఖ్యంత్రి నారా చంద్రబాబు నాయుడికి బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు వార్నింగ్ ఇచ్చారు. మోడీ పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే రాష్ట్రంలో టీడీపి ప్రభుత్వం ఉండదని ఆయన హెచ్చరించారు. 

రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందనే లెక్కలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ చెబుతారని జీవీఎల్ శనివారం మీడియాతో అన్నారు. మోడీ పర్యటనపై ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. టీడీపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆయన అన్నారు. 

ప్రధాని పర్యటనను అడ్డుకుంటే తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ప్రకటనలు చేస్తే రాష్ట్రంలో టీడీపి ప్రభుత్వం ఉండదని ఆయన అన్నారు. 

ప్రధాని మోడీ రేపు (ఆదివారం) గుంటూరు పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా తెలుగుదేశం, వామపక్షాలు ఇప్పటికే నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu