రాజుకుంటున్న ఎంఎల్ సి ఎన్నికల వేడి

Published : Oct 24, 2016, 10:28 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
రాజుకుంటున్న ఎంఎల్ సి ఎన్నికల వేడి

సారాంశం

రాజుకుంటున్న  ఎన్నికల వేడి మార్చి 5న స్ధానాలకు ఎన్నికలు అన్నీ స్ధానాల్లోనూ గెలవాలని సిఎం ఆదేశం

శాసన మండలి ఎన్నికల వేడి రాజుకుంటున్నది. వచ్చే మార్చిలో ఏపిలోని పట్టభద్రులు, ఉపాధ్యాయులకు చెందిన ఐదు స్ధానాలకు ఎన్నికలు జరుగుతాయి. మామూలుగా అయితే, ఈ ఎన్నికలకు పెద్దగా హడావుడి ఉండదు. అయితే, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఈ స్ధానాలకు కూడా రాజకీయ రంగులు బాగా పులుముకుంటున్నాయి. మొత్తం ఐదు స్ధానాల్లోనూ తెలుగుదేశం పార్టీకి చెందిన లేదా మద్దతుదారులే గెలవాటని సిఎం చంద్రబాబునాయడు పార్టీ, ప్రభుత్వంలోని ముఖ్యులను ఆదేశించటంతో ఎన్నికల వేడి ఇప్పటి నుండే రాజుకుంటున్నది.

  పట్టభద్రుల స్ధానాలకు సంబంధించి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోస్తా, రాయలసీమ జిల్లాలకు సంబంధించి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, రాయలసీమ జిల్లాలకు చెందిన కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని మూడు స్ధానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక, ఉపాధ్యాయ స్ధానాలకు సంబంధించి రెండు స్ధానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఒక స్ధానం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు కలిపి రెండో స్ధానంగా ఉన్నాయి.

   ప్రస్తుతం పై ఐదు స్ధానాల్లో నాలుగింటిలో పిడిఎఫ్ అభ్యర్ధులే ఉన్నారు. మిగిలిన ఒక్క స్ధానంలో పిఆర్ టియు అభ్యర్ధి కొనసాగుతున్నారు. అంటే గతంలో జరిగిన ఎన్నికల్లో టిడిపి ఏ ఒక్క స్ధానంలో కూడా గెలవలేకపోయింది. ఇపుడు ఎన్నికలు జరిగే సమయానికి టిడిపి అధికారంలో ఉండటం, ఎన్నికల వ్యవహారాన్ని చంద్రబాబు కుమారుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుండటంతో ఎన్నికల్లో జోక్యం చేసుకోవాల్సిన అగత్యం టిడిపికి తప్పటం లేదు. అందుకనే అభ్యర్ధుల ఎంపిక, మద్దతు తదితర వ్యవహారాలను మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాధరెడ్డి చూసుకుంటున్నారు.

  అందుకనే ఈ ఎన్నికల విషయాన్ని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా ప్రతిష్టగా తీసుకుంది. తన మద్దతుదారులతో మంతనాలు మొదలు పెట్టింది. అవసరమైతే పిడిఎఫ్, పిఆర్ టియు అభ్యర్ధులకు మద్దతుగా నిలవాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. పై స్ధానాలకు మార్చి 5వ తేదీన ఎన్నిక జరుగుతుందని ఎన్నికల కమీషన్ గతంలోనే ప్రకటించింది. అందుకు ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. డిసెంబర్ 30వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?