భారీ ఎన్ కౌంటర్లో 24 మంది మావోయిస్టుల మృతి

Published : Oct 24, 2016, 09:17 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
భారీ ఎన్ కౌంటర్లో 24 మంది మావోయిస్టుల మృతి

సారాంశం

మావోయిస్టుల ఎన్ కౌంటర్ 24 మంది మృతి మృతుల్లో అగ్రనేతలు ? కొనసాగుతున్న గ్రేహౌండ్స్ దళాలు గాలింపు

మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులోని  మల్కనగిరి జిల్లాలో సోమవారం తెల్లవారిజామున జరిగిన భారీ ఎన్ కంటర్ లో 24 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల ఒకే ఎన్ కౌంటర్లో ఇంత మరణించటం ఇదే ప్రధమం. ఏపి గ్రేహౌండ్స్ దళాలు, ఒడిస్సా పోలీసుల సంయుక్త గాలింపుల్లో మావోయిస్టుల ఎన్ కౌంటర్ జరిగినట్లు డిజిపి సాంబశివరావు తెలిపారు.

మల్కన్ గిరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సుమారు 100 మంది మావోయిస్టు అగ్రనేతలు శిక్షణా శిభిరాన్ని నిర్వహిస్తున్నారని, ప్లీనరీ జరుగుతోందన్నక పక్కా సమాచారంతో పోలీసు దళాలు అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలకు దిగాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలను పశిగట్టిన పోలీసు దళాలు వ్యూహాత్మకంగా అన్నీ వైపుల నుండి వారిని చుట్టి ముట్టి ఒక్కసారిగా కాల్పులకు దిగినట్లు సమాచారం.

   దాంతో ఊహించని పరిణామానికి బిత్తరపోయిన మావోయిస్టులు తమ అగ్ర నేతలను తప్పించటంపైనే ప్రధాన దృష్టిని సారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే తేరుకున్న మావోయిస్టులు పోలీసులపైకి ఎదురు కాల్పలు జరుపుతూ తమ అగ్ర నేతలను ఘటనా స్ధలం నుండి దూరంగా తీసుకెళ్లిపోయినట్లు సమాచారం. పోలీసు దళాల దాడి సమయంలో మావోయిస్టు అగ్రనేతలు పలువురు బస చేసినట్లు సమాచారం.

పోలీసుల వర్గాలు చెప్పిన ప్రకారం మృతుల్లో సుధాకర్, ఉదయ్, గణపతి తదితరులున్నారు. మొత్తం 23 మంది మావోయిస్టులు మృతి చెందగా అందులో ఎనిమిది మంది మహిళలున్నారు. మృతిచెందిన వారందరినీ గుర్తించేందుకు పోలీసు ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఘటనా స్ధలంలో 4 ఏకె 47 తుపాకులు, ఎస్ఎల్ఆర్ తుపాకులు, విస్పోటక సామగ్రితో పాటు ఇతర మారణాయుధాలున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఎన్ కౌంటర్ లో గాయపడిన ఇతరుల గురించి పోలీసులు గాలింపు చర్యలను విస్తృతం చేసారు. అవసరమైతే మరిన్ని అదనపు దళాలను కూడా పంపుతామని డిజిపి సాంబశివరావు వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన పోలీసులకు అత్యవసర చికిత్స అందించటంలో భాగంగా ఘటనా స్ధలానికి హెలికాప్టర్లను పంపుతున్నట్లు కూడా తెలిపారు. ఇదిలా వుండగా, ఎన్ కౌంటర్లో 24 మంది మవోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు చెప్పటాన్ని పౌర హక్కుల సంఘం నేతలు ఖండిస్తున్నారు.

మావోయిస్టుల మృతదేహాలన్నింటినీ భద్రపరచాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల బంధువులు వచ్చే వరకూ పోస్టుమార్టమ్ ప్రక్రియను మొదలు పెట్టకూడదని సిఎల్సీ ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేస్తున్నారు. ప్లీనరీ జరుగుతున్నపుడు మావోయిస్టులపై దాడులు చేసి మట్టు పెట్టటం మంచి పద్దతి కాదని విరసం ప్రముఖుడు వరవరరావు వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?