మైనర్ల ప్రేమ.. బాలికను గర్భవతిని చేసిన బాలుడి అరెస్ట్..

Published : Dec 21, 2021, 10:29 AM IST
మైనర్ల ప్రేమ.. బాలికను గర్భవతిని చేసిన బాలుడి అరెస్ట్..

సారాంశం

గ్రామానికి చెందిన బాలుడు (17) ఇంటర్ పూర్తి చేసి గ్రామంలో ఉంటున్నాడు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. ఎలాగూ ప్రేమించుకున్నాం కదా అనుకున్నారేమో.. శారీరకంగా కలిశారు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు నెల రోజుల కిందట నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.   

చింతపల్లి : తాజంగి పంచాయతీ బోయపాడు గ్రామంలో ఓ బాలికను అదే గ్రామానికి చెందిన బాలుడు గర్భవతిని చేశాడు. girl తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం బాలుడ్ని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయపాడుకు చెందిన బాలిక (15) తొమ్మిదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటివద్దే ఉంటోంది. 

గ్రామానికి చెందిన బాలుడు (17) ఇంటర్ పూర్తి చేసి గ్రామంలో ఉంటున్నాడు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. ఎలాగూ ప్రేమించుకున్నాం కదా అనుకున్నారేమో.. శారీరకంగా కలిశారు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు నెల రోజుల కిందట నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 

పరీక్షించిన వైద్యులు ఎనిమిది నెలల pregnant అని చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బాలుడ్ని అరెస్ట్ చేసి జువెనైల్ హోంకి తరలించినట్లు ఎస్సై అలీ పేర్కొన్నారు. 

Vizag Ashram: జ్ఞానానంద ఆశ్రమంలో మరో 2 ఆవులు మృతి.. మూడు రోజుల్లోనే 26కు పైగా..

ఇలాంటి ఘటనే చెన్నైలో జరిగింది. ప్రియురాలి మీద స్నేహితులతో కలిసి rape attemptకి పాల్పడ్డాడో కిరాతక ప్రియుడు. ఈ దారుణమైన ఘటన నామక్కల్ లో వెలుగుచూసింది. bihar కు చెందిన ఓ యువతి నామక్కల్ లోని వేప్పేడులోని ఓ ప్రైవేటు మిల్లులో పనిచేస్తోంది. అక్కడే పనిచేస్తున్న బాల్ రాజ్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అయితే, ఆదివారం సెలవు కావడంతో ప్రియురాలికి మాయమాటలు చెప్పి తన ఇంటికి బాల్ రాజ్ తీసుకెళ్లాడు.

ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసిన ఆమె మీద బాలరాజు లైంగికదాడి చేశాడు. అంతే కాదు మిత్రులు ప్రదీప్, మనోజ్ కు అప్పగించాడు. ముగ్గురు కలిసి ఆమె మీద పలుమార్లు సామూహిక లైంగిక దాడి చేయడంతో ఆమె స్పృహ తప్పింది.  ఆమె స్పృహ తప్పి కింద పడిపోవడంతో ఆందోళన చెందిన అక్కడి నుంచి ఆ ముగ్గురు ఉడాయించారు.

తల్లిదండ్రులపై తప్పుడు ఫిర్యాదు.. కొడుకుకు మూడు రోజుల జైలు..

అర్థరాత్రి వేళ స్పృహలోకి వచ్చిన ఆ యువతి పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో బీహార్ కు పారిపోయే ప్రయత్నంలో ఉన్న ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.  

ఇదిలా ఉండగా,  డిసెంబర్ 18న హైదరాబాద్ లో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను బెదిరించిన ప్రబుద్ధుడు.. ప్రియుడి ముందే ఆమెపై rape attemptకి పాల్పడ్డాడు. అవమానం భారం భరించలేక బాధితురాలు, ఆమె ప్రియుడు వికారాబాద్ సమీపంలో విషం తాగి suicideకు యత్నించారు. ఎస్ ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి జిల్లాకు చెందిన మహిళ (32)కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu