ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

By pratap reddyFirst Published 23, Sep 2018, 8:49 PM IST
Highlights

ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి హత్యకు పథక రచన చేసి, అమలు చేశాడని వారంటున్నారు. ప్రతీకారంగానే మావోయిస్టులు వారిద్దరిని చంపేశారని మాట కూడా వినిపిస్తోంది. 2016లో పోలీసులు 30 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేశారు. దానికి ప్రతీకారంగానే వారిద్దరిని పట్టుకుని హతమార్చినట్లు భావిస్తున్నారు.

విశాఖపట్నం: శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వర రావును, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్య చేసిన సంఘటనలో ఆగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే లేడని పోలీసులు చెప్పారు. ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి హత్యకు పథక రచన చేసి, అమలు చేశాడని వారంటున్నారు. ప్రతీకారంగానే మావోయిస్టులు వారిద్దరిని చంపేశారని మాట కూడా వినిపిస్తోంది.

2016లో పోలీసులు 30 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేశారు. దానికి ప్రతీకారంగానే వారిద్దరిని పట్టుకుని హతమార్చినట్లు భావిస్తున్నారు. దాదాపు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ గ్రామదర్శిని కార్యక్రమానికి డుంబ్రిగూడ మండలం లివిడిపుట్టకు వెళ్లే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ తెలిపారు. 

దాదాపు 20 మంది మావోస్టులు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే వాహనాన్ని ఆపివేశారని, గన్‌మెన్ల దగ్గర నుంచి ఆయుధాలు తీసేసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ మీద కాల్పులు జరిపారని చెప్పారు. 

ఒడిశాకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దగ్గర ఉన్న తుపాకులను కూడా తీసేసుకున్నట్లు తెలిపారు. మావోల బందీలో ఇంకా ఎవరూ లేరని స్పష్టం చేశారు. కాల్పులు జరిపినప్పుడు పది మంది మావోయిస్టుల దగ్గరే తుపాకులున్నట్లు తెలిసిందని ఆయన అన్నారు. 

ఇదిలావుంటే, ఇద్దరు నేతల మృతదేహాలను అరకుకు తరలించారు. అక్కడే వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే మృతదేహాన్ని చూసి కిడారి సర్వేశ్వర రావు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. 

సంబంధిత వార్తలు

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

Last Updated 23, Sep 2018, 9:04 PM IST