నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

First Published 23, Sep 2018, 8:22 PM IST
Highlights

నిన్న రాత్రి 8 గంటలకు కిడారి సర్వేశ్వరరావుకు తాను ఫోను చేశానని, అయితే సిగ్నల్స్ సరిగ్గా లేవని 15 నిమిషాల్లో ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేశారని నక్కా ఆనందబాబు చెప్పారు. అనంతరం 20 నిమిషాలకు కిడారి ఫోన్ చేసినట్లు తెలిపారు. 

అమరావతి: మావోయిస్టుల చేతిలో మరణించిన కిడారి సర్వేశ్వర రావు నిన్న రాత్రి మంత్రి నక్కా ఆనందబాబుతో మాట్లాడారు. నిన్న రాత్రి 8 గంటలకు కిడారి సర్వేశ్వరరావుకు తాను ఫోను చేశానని, అయితే సిగ్నల్స్ సరిగ్గా లేవని 15 నిమిషాల్లో ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేశారని నక్కా ఆనందబాబు చెప్పారు. అనంతరం 20 నిమిషాలకు కిడారి ఫోన్ చేసినట్లు తెలిపారు. 

తాను 25న విశాఖ వస్తున్నానని చెప్తే ఆ రోజున జిల్లా సమావేశం ఉందని, అందువల్ల 28న వస్తే భారీ సభ పెడతానని కిడారి చెప్పారని ఆయన చెప్పారు. ఇంతలోనే ఇలా జరగడం తనను కలిచి వేసిందని ఆయన అన్నారు. ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ ఘటనలో శాంతిభద్రతల వైఫల్యం లేదని అన్నారు.  అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హత్య చేయడం దుర్మార్గమైన చర్య ఆయన అన్నారు. ఇద్దరు నేతలు కూడా చిత్తశుద్ధితో పని చేసేవారని, అలాంటి వాళ్లు మావోల దాడికి గురికావడం బాధాకరమని అన్నారు. 

ఏవైనా సమస్యలుంటే వారిద్దరిని కిడ్నాప్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేవారమని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ప్రజల సమస్యలను కిడారి ఎప్పుడూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉండేవారన్నారు. 

సంబంధిత వార్తలు

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

Last Updated 23, Sep 2018, 9:05 PM IST