నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి .. అధికారిక ప్రకటన

Siva Kodati |  
Published : Jul 25, 2023, 09:17 PM ISTUpdated : Jul 25, 2023, 09:18 PM IST
నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి .. అధికారిక ప్రకటన

సారాంశం

నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌ఛార్జీగా ఎమ్మెల్యే కోటంరెడ్డిని శ్రీధర్ రెడ్డిని ఆ పార్టీ నియమించింది.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు గాను కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డిపై  వైసీపీ నాయకత్వం  సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. 

నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌ఛార్జీగా ఎమ్మెల్యే కోటంరెడ్డిని శ్రీధర్ రెడ్డిని ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రూరల్‌కు ఇన్‌ఛార్జీగా నియమించినట్లు అచ్చెన్న వెల్లడించారు. నెల్లూరు రూరల్‌లో టీడీపీ బలోపేతమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 

 

 

కాగా.. గత నెలలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రలు.. నెల్లూరు నగరంలోని మాగుంట లే అవుట్‌లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసానికి వెళ్లి  ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీలోకి చేరాలని ఆయనకు సోమిరెడ్డి, బీద రవిచంద్రలు ఆహ్వానం పలికారు.

ALso Read: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి టీడీపీ ఆహ్వానం.. మరి ఆయన ఏమని సమాధానం ఇచ్చారంటే ?

ఇకపోతే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు గాను కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డిపై  వైసీపీ నాయకత్వం  సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే కేబినెట్‌లో స్థానం లభించకపోవడంతో పాటు మరికొన్ని కారణాలతో వైసీపీ అధిష్టానంపై కోటంరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీ  ఎమ్మెల్యేగా ఉండి కూడా  సమస్యల  పరిష్కారం కోసం నిరసనకు దిగాల్సిన  పరిస్థితులు  నెలకొన్నాయని   శ్రీధర్ రెడ్డి గతంలో  ఆరోపణలు  చేసిన విషయం తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!