రాజకీయాల్లో ఉంటే జగన్‌ వెంటే.. మీటింగ్‌కు రాకపోవడానికి కారణాన్ని పార్టీకి చెప్పాను: ఎమ్మెల్యే ఆర్కే

Published : Apr 04, 2023, 12:25 PM IST
రాజకీయాల్లో ఉంటే జగన్‌ వెంటే.. మీటింగ్‌కు రాకపోవడానికి కారణాన్ని పార్టీకి చెప్పాను: ఎమ్మెల్యే ఆర్కే

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల, రీజినల్ కో ఆర్ఢినేటర్లు, నియోజకవర్గ ఇంచార్జ్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ మీటింగ్‌కు తాను హాజరుకాకపోవడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు.  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల, రీజినల్ కో ఆర్ఢినేటర్లు, నియోజకవర్గ ఇంచార్జ్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ఇద్దరు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మీటింగ్‌కు తాను వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) స్పందించారు. తాను ఎందుకు హాజరుకాలేకపోయానని పార్టీకి తెలియజేశానని  చెప్పారు. ఇంట్లో ఫంక్షన్ ఉండటం, కొన్ని అనారోగ్య కారణాల వల్ల నిన్నటి సమావేశానికి హాజరుకాలేదని చెప్పారు. అదే సమయంలో వైసీపీ అధిష్టానానికి, తనకు మధ్య గ్యాప్ ఉందనే వార్తలను కూడా ఆర్కే ఖండించారు. 

తాను రాజకీయాల్లో ఉంటే జగన్ వెంటనే ఉంటానని.. లేకపోతే  వ్యవసాయం చేసుకుంటానని కామెంట్ చేశారు. ఇంకో పార్టీ మారడం అనేది జరగదని చెప్పారు. సీఎం జగన్ అన్ని కులాలు, మతాలు, వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మంగళగిరి ఆర్కే పోటీ అనేది జగన్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. పరిస్థితులను బట్టి మార్పు జరిగితే జరగొచ్చని.. లేకపోతే తాను మంగళగిరి నుంచే  పోటీ చేస్తానని తెలిపారు. తాను పోటీ చేయకపోయినా మంగళగిరిలో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

తాను రోజు వెళ్లి సీఎం జగన్‌ను కలవాల్సిన  అవసరం లేదన్నారు. జగన్‌తో పాటు రాజశేఖర్ కుటుంబ సభ్యులు తనను ఎంతో అప్యాయంగా చూసుకుంటారని చెప్పారు. తనకు పార్టీ అధిష్టానంతో ఎటువంటి గ్యాప్ లేదని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu