మండలిలో లోకేష్ పై మంత్రుల దాడి... డిప్యూటీ ఛైర్మన్ పై కూడా: టిడిపి ఎమ్మెల్సీలు

By Arun Kumar PFirst Published Jun 17, 2020, 9:58 PM IST
Highlights

శాసన మండలిని వాయిదావేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించగానే ఆయనపై వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు దాడికి ప్రయత్నించారని టిడిపి ఎమ్మెల్సీలు ఆరోపించారు. 

అమరావతి: శాసన మండలిని వాయిదావేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించగానే ఆయనపై వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు దాడికి ప్రయత్నించారని టిడిపి ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఇలా ఛైర్మన్ పై దాడికి యత్నిస్తున్న సమయంలో సభలోనే  వున్న నారా లోకేష్ చేతిలో సెల్ ఫోన్ వుండటాన్ని గమనించిన వైసిపి సభ్యులు ఎక్కడ తమ దౌర్జన్యాన్ని చిత్రీకరిస్తున్నాడో అని భయపడిపోయారని  తెలిపారు. ఈ అనుమానంతో లోకేష్ పై కూడా దాడికి యత్నించారని టిడిపి ఎమ్మెల్సీలు తెలిపారు. 

మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లితో పాటు కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు లోకేష్ వైపు దూసుకొచ్చారని... ఆయనపై దాడి చేస్తూ ఉండటంతో  టిడిపి ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, మంతెన సత్యన్నారాయణ రాజులు అడ్డుకున్నారన్నారు. దీంతో వారిని బూతులు తిట్టడమే కాదు మండలి డిప్యూటీ ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్సీలపై కూడా వైసీపీ ఎమ్మెల్సీలు భౌతిక దాడికి ప్రయత్నించారని టిడిపి ఆరోపిస్తోంది. 

read more   చేతులెత్తి మొక్కినా పట్టించుకోలేదు: మండలిలో టీడీపీ తీరుపై ఉమ్మారెడ్డి ఫైర్

మండలి వాయిదాతో ఆరు బిల్లులు ఆగిపోయాయి... ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా మండలి ఆమోదం లభించలేదని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు కూడా ఆమోదం పొందలేవన్నారు. మధ్యాహ్నం నుంచి 18 మంది మంత్రులు మండలిలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దాడికి వస్తుంటే చేతులు అడ్డుపెట్టిన లోకేశ్ పై ఫోటోలు తీసారంటూ అబద్ధమాడారని.... బూతులతో అనరాని మాటలు అన్నారని అర్జునుడు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక మరో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండలి పరిణామాలపై స్పందిస్తూ.... మంత్రులపై దాడి జరిగిందంటున్న ప్రభుత్వం వీడియో పుటేజీలు భయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఉన్నది ఉన్నట్లు వీడియోలు విడుదల చేయాలని... సభలో మంత్రులు జిప్ తీయడం, తొడ కొట్టడం ఎక్కడా చూడలేదన్నారు. మంత్రులపై తాము దాడి చేయలేదని...వారే ప్రతిపక్ష సభ్యుల వైపు వచ్చి దాడి చేశారని ఆరోపించారు.   

read more  మంత్రి వెల్లంపల్లిపై టిడిపి ఎమ్మెల్సీల దాడి... లోకేష్ పై మంత్రుల ఫిర్యాదు
 


 

click me!