చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి వామపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీల ఇళ్లల్లో ఐటీ దాడులు జరిగితేనే పది సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ కి సరిపోయే డబ్బు దొరికిందన్నారు. చంద్రబాబు అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లో సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన తనయువు లోకేష్ ఇళ్లల్లో కూడా సోదాలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దోచుకున్న సొమ్మును కేంద్ర ప్రభుత్వం కక్కించాలని డిమాండ్ చేశారు. తన అవినీతి బయట పడుతుందనే చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రూ.2వేల కోట్ల అవినీతిపై పవన్ ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు.
undefined
Also Read మాకేం సంబంధం: చంద్రబాబు మాజీ పిఎస్ ఇంట్లో ఐటి సోదాలపై యనమల..
చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి వామపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీల ఇళ్లల్లో ఐటీ దాడులు జరిగితేనే పది సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ కి సరిపోయే డబ్బు దొరికిందన్నారు. చంద్రబాబు అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై వైసీపీ ఎంపీ మార్గాని భారత్ కూడా మాట్లాడారు. టీడీపీ ముఖ్య నేతలపై ఐటీ దృష్టిసారిస్తే ఎన్ని లక్షల కోట్లు బయటపడతాయో అని విమర్శించారు. టీడీపీ నేతల అక్రమాదాయం ఇప్పుడిప్పుడే బయటపడుతోందన్నారు. నాలుగైదు చోట్ల సోదాలు చేస్తేనే వేల కోట్ల రూపాయలు బయటపడ్డాయని చెప్పారు. ఐటీ దాడులపై చంద్రబాబు ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.