తిరుమలలో మంత్రి ఉషాశ్రీ చరణ్ హల్‌చల్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శ్రీవారి భక్తులు

By Sumanth KanukulaFirst Published Aug 15, 2022, 9:17 AM IST
Highlights

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్‌, వరుస సెలవులతో శ్రీవారం దర్శనానికి భక్తులు పోటెత్తారు.  ఈ నేపథ్యంలోనే టీటీడీ.. వీకెండ్స్‌తో పాటు సెలవు దినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టుగా తెలిపింది. అయితే ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ మాత్రం తిరుమలలో హల్ చల్ చేశారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్‌, వరుస సెలవులతో శ్రీవారం దర్శనానికి భక్తులు పోటెత్తారు.  ఈ నేపథ్యంలోనే టీటీడీ.. వీకెండ్స్‌తో పాటు సెలవు దినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టుగా తెలిపింది. అయితే ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ మాత్రం తిరుమలలో హల్ చల్ చేశారు. ఆమె తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఉషాశ్రీ చరణ్.. 50 మంత్రి అనుచరులతో శ్రీవారిని దర్శించుకున్నారు. మరో 10 సుప్రభాతం టికెట్లను పొందారు.ఇక, భక్తుల కష్టాలపై ప్రశ్నించిన మీడియాపై మంత్రి గన్‌మెన్లు దురుసుగా ప్రవర్తించారు. ఓ వీడియో జర్నలిస్టును నెట్టేశారు.

ఇక, మంత్రి ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి టీటీడీ ఈ టికెట్లను జారీచేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీటీడీ సాధారణ భక్తుల కష్టాలను పట్టించుకోవడం లేదని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. 

ఇక, తిరుమలలో గత మూడు నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సేవా సదన్ మీదుగా రింగ్ రోడ్డులోని ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తులు వేచి ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. శ్రీవారి సర్వదర్శనానికి 30గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి 6గంటల సమయం పడుతోంది. ఆదివారం.. 92,328 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 

click me!