ఇద్దరం ఒకటే కులం.. నువ్వు సన్నాసి అన్నా, నేను ఏరా శుంఠ అన్నా పర్లేదు: పవన్‌కు పేర్నినాని చురకలు

Siva Kodati |  
Published : Sep 26, 2021, 05:33 PM IST
ఇద్దరం ఒకటే కులం.. నువ్వు సన్నాసి అన్నా, నేను ఏరా శుంఠ అన్నా పర్లేదు: పవన్‌కు పేర్నినాని చురకలు

సారాంశం

సాయి ధరమ్ తేజ్- దేవా కట్టా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అటు రాజకీయంగా, ఇటు సినీ పరిశ్రమలోనూ సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ ఈవెంట్‌లో ఆయన పరిశ్రమలోని సమస్యల మీద స్పందించాడు. తాజాగా మంత్రి పేర్ని నాని లెక్కలతో సహా మీడియా ముందుకు వచ్చారు.

సాయి ధరమ్ తేజ్- దేవా కట్టా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అటు రాజకీయంగా, ఇటు సినీ పరిశ్రమలోనూ సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ ఈవెంట్‌లో ఆయన పరిశ్రమలోని సమస్యల మీద స్పందించాడు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదం మీద మీడియా చూపిన అత్యుత్సాహం, ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను అమ్మడం, ఇండస్ట్రీ మీద ప్రభుత్వం కక్షసాధిస్తోందంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి వైసీపీ నేతలు, మంత్రులు పవన్‌ కల్యాణ్‌కు కౌంటరిస్తున్నారు. తాజాగా మంత్రి పేర్ని నాని లెక్కలతో సహా మీడియా ముందుకు వచ్చారు.

ఏపీ ప్రభుత్వం సినిమా హాళ్లను మూయించిందని పవన్ అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 1100 థియేటర్లలో 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయని పేర్ని నాని మండిపడ్డారు. తెలంగాణలో 519 గాను 413 థియేటర్లలో మాత్రమే సినిమాలు ప్రదర్శిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. తెలుగు  చిత్ర పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎలా ఇబ్బంది పెట్టిందో చెప్పాలంటూ పవన్‌కు నాని సవాల్ విసిరారు. నిర్మాతలకు తెలంగాణ కంటే  ఏపీలోనే ఎక్కువ షేర్ వస్తుందని మంత్రి తెలిపారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై మీడియా చేసిన తప్పేంటీ.. పాపం ఏంటో చెప్పాలంటూ నాని డిమాండ్  చేశారు.

తెలంగాణ పోలీసులు ప్రమాదంపై ఏదైతే చెప్పారో.. అదే మీడియా చెప్పిందని మంత్రి గుర్తుచేశారు. పవన్‌కు దమ్ముంటే తెలంగాణ పోలీసులను, కేసీఆర్‌ను తిట్టాలని నాని సవాల్ విసిరారు. రిపబ్లిక్ ఇండియా కాబట్టే మీరు ఏది వాగినా చెలామణి అయిపోతోందని నాని గుర్తుచేశారు. ఒకే కులం కాబట్టి నువ్వు సన్నాసి అన్నా.. నేను  ఏరా, శుంఠ అన్నా ఇబ్బంది లేదని మంత్రి సవాల్ విసిరారు. మా పీకే పిరికి సన్నాసిలే  అని చెబుతానని.. కోడి కత్తి కేసు ఎన్ఐఏ చూస్తొందని దమ్ముంటే అమిత్ షాను కేసు వివరాలు అడగాలని డిమాండ్ చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్