భారత్ బంద్‌కు మద్ధతు.. వైఫల్యంపై దృష్టి మళ్లీంచడానికే: ఏపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు ఆగ్రహం

Siva Kodati |  
Published : Sep 26, 2021, 04:01 PM IST
భారత్ బంద్‌కు మద్ధతు.. వైఫల్యంపై దృష్టి మళ్లీంచడానికే: ఏపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు ఆగ్రహం

సారాంశం

రాష్ట్రంలో తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే వైసీపీ సర్కారు భారత్ బంద్ కు మద్దతిస్తోందని వీర్రాజు ఆరోపించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్ బంద్ ను ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు

సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఈ నెల 27న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు కూడా అదే రోజున బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో, బంద్ కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలపడంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు.

రాష్ట్రంలో తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే వైసీపీ సర్కారు భారత్ బంద్ కు మద్దతిస్తోందని వీర్రాజు ఆరోపించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్ బంద్ ను ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని, వాటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సోము వీర్రాజు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానివి అవకాశవాద రాజకీయాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు చట్టాలపై చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటించినా విపక్షాలు బంద్ కు పిలుపునిస్తే, ఆ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం అనైతికం అని సోము వీర్రాజు దుయ్యబట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్
Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu