మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. నిన్ననే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. హైద్రాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివశంకర్ రెడ్డిని ఈ నెల 17న Cbi అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న పులివెందుల కోర్టులో ఆయనను పోలీసులు హాజరుపర్చారు. దీంతో కోర్టు ఆయనను జ్యూడిషీయల్ రిమాండ్ కు తరలించింది.Devireddy siva shankar Reddy సీబీఐ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొన్నారు. గతంలో YS Vivekananda Reddy వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
also read:YS Vivekananda Reddy murder case: దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ
undefined
ఈ కేసులో సీబీఐకి దస్తగిరి అఫ్రూవర్ గా మారాడు. హత్య జరిగిన రోజున చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన పూసగుచ్చినట్టుగా సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు సమర్పించారు. ఈ ఏడాది ఆగష్టు 30 దస్తగిరి ఈ స్టేట్‌మెంట్ ను ఇచ్చారని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.అయితే ఇప్పటికే ఈ కేసులో దస్తగిరితో పాటు సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలపై సీబీఐ అభియోగాలు మోపింది. ఈ మేరకు కోర్టుకు ప్రాథమిక ఛార్జీషీట్ ను దాఖలు చేసింది. త్వరలోనే పూర్తి స్థాయి చార్జీషీట్ ను కోర్టుకు సీబీఐ అందచేయనుంది.2019 మార్చి 14న వైఎస్ వివేకానందరెడ్డిని అతని ఇంట్లోనే దుండగులు హత్య చేశారు. బెంగుళూరులో చోటు భూ సెటిల్ మెంట్ విషయమై వచ్చిన ఆర్ధిక లావాదేవీల విషయమే ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణమని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు.
వైఎస్ వివేకానందరెడ్డిని హత్యకు 2019 ఫిబ్రవరి 16న కుట్ర జరిగిందని దస్తగిరి సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ హత్య చేస్తే తనకు రూ. 5 కోట్లు ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి హామీ ఇచ్చారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో దస్తగిరి వివరించారు. ఈ ఘటన తర్వాత సునీల్ యాదవ్ క తనకు కోటి రూపాయాలను అడ్వాన్స్ గా ఇచ్చారని దస్తగిరి సీబీఐకి తెలిపారు. ఈ విషయాలపై లోతుగా విచారణ చేసేందుకు గాను సీబీఐ శివశంకర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది. వచ్చే ఏడాది డిసెంబర్ 2వ తేదీ వరకు శివశంకర్ రెడ్డి విచారణ చేయనుంది.ఈ హత్య కేసులో అసలు నిందితులను వెలికితీయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిలు పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.తొలుత ఈ హత్యపై టీడీపీ నేతలపై వైసీపీ విమర్శలు చేసింది ఆనాడు మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి సహా బీటెక్ రవిలపై ఆ పార్టీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.