ఏపీకి రానున్న కేంద్ర బృందం ... మూడు రోజులపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

By Siva KodatiFirst Published Nov 25, 2021, 8:09 PM IST
Highlights

నవంబర్ 13 నుంచి 20 వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలు వల్ల జరిగిన నష్టాలని అంచనా వేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం (central team) మూడు రోజులపాటు (నవంబర్ 26-28) ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.

వరదలు (ap floods), వర్షాల (ap rains) కారణంగా కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు చివురుటాకులా వణికిన సంగతి తెలిసిందే. నవంబర్ 13 నుంచి 20 వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలు వల్ల జరిగిన నష్టాలని అంచనా వేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం (central team) మూడు రోజులపాటు (నవంబర్ 26-28) ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈమేరకు ఏపీ విపత్తుల శాఖ కమిషనర్  కె కన్నబాబు గురువారం తెలియజేసారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అడ్వైజర్ (ఎన్డీఎంఏ) కునాల్ సత్యార్ధి నేతృత్వంలో రెండు బృందాలుగా పర్యటించనున్నారు. అనంతరం సోమవారం ఉదయం కేంద్ర బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశం కానున్నట్లు ఆయన తెలియజేశారు.

శుక్రవారం 26-11-2021
బృందం చిత్తూరు జిల్లాలో పర్యటించనుంది.

శనివారం 27-11-2021
చిత్తూరు జిల్లాలో ఒక బృందం , వైయస్ఆర్ కడప జిల్లాలో ఒక బృందం  పర్యటించనుంది.

ఆదివారం 28-11-2021
నెల్లూరు జిల్లాలో రెండు బృందాలు పర్యటించనున్నాయి.

ALso Read:‘‘ సీమ ’’కు మరో వానగండం... జగన్ సమీక్ష, ఏపీలో వరదల వల్ల జరిగిన నష్టమెంతో తెలుసా..?

మరోవైపు రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) బుధవారం సమీక్ష (review meeting) నిర్వహించారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష చేసిన సీఎం సహాయక చర్యల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఇళ్లు కూలిపోయిన వారిని పునరావాస శిబిరాలకు తరలించడంతో పాటు ఆహారం, తాగునీటిని వరద బాధితులకు అందుబాటులో వుంచాలని ఆదేశించారు. ఇక నాలుగు జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని సీఎం జగన్‌కు వివరించారు అధికారులు. వర్షాల వల్ల వ్యవసాయ రంగానికి రూ.1353 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. లక్షా 42 వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టమైందని చెప్పారు. రహదారులు పాడవ్వడం వల్ల జరిగిన నష్టం రూ.1756 కోట్లని అంచనా వేశారు. అలాగే డ్యాములు, సాగునీటి శాఖకు జరిగిన నష్టం అంచనా 556 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. 
 

click me!