ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. మంత్రి Perni Nani ద్వజం

By Rajesh K  |  First Published Dec 17, 2021, 5:07 PM IST

 ఏపీ ప్ర‌భుత్వం మీద ఎల్లో మీడియా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంద‌ని రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కు ఉరి అంటూ రాసిన వార్తను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. చంద్ర‌బాబు చేసిన పనికి .. జ‌గ‌న్ స‌ర్కార్ ను విమ‌ర్శించడేమిట‌ని ప్ర‌శ్నించారు.
 


ఏపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని  (Perni Nani) మండిపడ్డారు. ఇవాళ ఆయ‌న  ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుపై రామోజీకి అపారమైన ప్రేమ అంటూ దుయ్యబట్టారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కు ఉరి అంటూ ఈనాడు రాసిన వార్తపై ఆయ‌న తీవ్రంగా ఖండించారు. 

ఇలాంటి అసత్యవార్తలతో ఈనాడు.. ఆంధ్ర‌జ్యోతితో పోటీ పడుతోందని నాని అన్నారు. అస‌లు ఉనికిలో లేని ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఈనాడు అబద్ధపు ప్రచారం చేస్తోందని నిప్పులు చెరిగారు.  2016లో ఔట‌ర్ రింగ్ రోడ్డుకు ఒక ఊహాజనిత గీతలు గీసి కేంద్రానికి పంపారని, కానీ ముందుగా భూమిని సేకరించమని కేంద్రం స్పష్టం చేసింది. గూగుల్‌ మ్యాప్‌లో గీత గీసీ అదే ఔటర్‌ రింగ్‌రోడ్డని చెప్పారు. చంద్రబాబు కనీసం డీపీఆర్‌ కూడా తయారు చేయలేకపోయారని విమ‌ర్శించారు.

Latest Videos

undefined

Read Also: AP: మా ఇళ్లల్లో మేం బతుకుతుంటే ఎందయ్య మీ లొల్లి.. పోలీసులపై చింతమనేని ఫైర్

2017 నుంచి అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఎలా రాస్తార‌నీ, దానికి పూర్తి బాధ్య‌త వైసీపీ ప్ర‌భుత్వానిదేన‌ని ఈనాడు బురద చల్లే ప్ర‌య‌త్నం
చేసింద‌ని అన్నారు. దీని మీద ఆర్.వి.అసోసియేట్ అనే సంస్థ పీజిబిలిటి రిపోర్టు ఇచ్చిందని ఆయన చెప్పారు. అమరావతి రాజధాని కాదని ఎవరైనా చెప్పారా.? శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని జ‌గ‌న్ స‌ర్కార్ చెప్పుతోంది. విజయవాడ ట్రాఫిక్‌ కష్టాల గురించి చంద్రబాబు ఎప్ప‌డైనా  ఆలోచించారా?
చంద్రబాబు ఐదేళ్లు భ్రమల్లోనే బతికారు. దుర్గా గుడి ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లను చంద్రబాబు శంకుస్థాప‌న చేసి వ‌దిలేశార‌ని అన్నారు.

Read Also: చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు అరెస్ట్: గుజరాత్‌ నుండి విజయవాడకు తరలింపు

కానీ,  జగన్ అధికారంలోకి వచ్చాక ప్లైఓవర్‌కు మోక్షం కలిగింది. రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉన్న నేత సీఎం వైఎస్‌ జగన్‌. రెండున్నరేళ్లలో బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ కు అనుమతి సంపాదించి నిర్మాణం కూడా పూర్తి చేశారని అన్నారు. అమరావతి పాదయాత్రకు పెట్టిన ఖర్చుకూడా రాజధాని నిర్మాణానికి చంద్రబాబు పెట్టలేదు. రామోజీరావు ఇప్పటికైనా వాస్తవాలు రాయాలని’’  మంత్రి పేర్ని నాని హితవు పలికారు. 

Read Also: Janasena Vs TDP: వంగవీటి రంగా విగ్రహం వద్ద లోకేష్ కు చేదు అనుభవం

 విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు కట్టాలంటే 8 వేల ఎకరాలు అవసరమని ఏపీ మంత్రి పేర్ని నాని చెప్పారు.  అధికారంలో ఉన్నప్పుడే ప‌నులు చేయలేని టీడీపీ నేతలు... ఇప్పుడు మేము చేయలేదని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అస‌లు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలని అన్నారు.  మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ కుడా మండిప‌డ్డారు నాని. అమరావతిని నిజంగా అభివృద్ధి చేయగలిగేది వైఎస్ జగన్ నేని... ఇప్ప‌టికే ఈ వాస్త‌వం రాజధాని గ్రామాల ప్రజలకు తెలిసింద‌నీ,  స్టీల్‌ప్లాంట్‌పై పవన్‌ కల్యాణ్‌ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించ‌డం లేద‌ని..  ప‌వ‌న్ కు జగన్‌ను తిట్టడం తప్పా? ఏమైనా చేశారా? అని ప్ర‌శ్నించారు పేర్ని నాని.  

click me!