Janasena Vs TDP: వంగవీటి రంగా విగ్రహం వద్ద లోకేష్ కు చేదు అనుభవం (Video)

By Arun Kumar P  |  First Published Dec 17, 2021, 4:45 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. 


గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(nara lokesh) కు గుంటూరు జిల్లా (guntur district)లో చేదు అనుభవం ఎదురయ్యింది. తాడేపల్లి (thadepalli) మండలం కుంచనపల్లిలో శుక్రవారం లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వంగవీటి మోహనరంగా (vangaveeti ranga) విగ్రహానికి పూలమాల వేయడానికి ప్రయత్నించారు. అయితే లోకేష్ ను జనసేన నాయకులు అడ్డుకున్నారు. దీంతో రంగా విగ్రహానికి పూలమాల వేయకుండానే లోకేష్ వెనుదిరిగారు.  

లోకేష్ ను రంగా విగ్రహానికి పూలమాల వేయడానికి అడ్డుకోగా టిడిపి కార్యకర్తలు వారితో వాగ్విదానికి దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే జనసేన (janasena) కార్యాలయానికి వెళ్లిన లోకేష్ స్థానిక నాయకులతో మాట్లాడారు. అయినప్పటికి జనసైనికులు రంగా విగ్రహానికి పూలమాల వేయడాన్ని అడ్డుకోవడంతో లోకేష్ వెళ్ళిపోవాల్సి వచ్చింది.

Latest Videos

undefined

Video

ఈ ఘటనపై తాడేపల్లి జనసేన మండల అధ్యక్షుడు దాసరి నాగేంద్ర స్పందించారు. ఎలాంటి గొడవ జరక్కుండా చూడాలని పార్టీ నాయకులు చెప్పారని... అందుకోసమే ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. లోకేష్ తనతో మాట్లాడుతూ కలిసి పనిచేద్దామని అన్నారని... కానీ అధిష్టానం నిర్ణయం మేరకే తాము పనిచేస్తామని చెప్పినట్లు నాగేంద్ర పేర్కొన్నారు. 

read more  AP: మా ఇళ్లల్లో మేం బతుకుతుంటే ఎందయ్య మీ లొల్లి.. పోలీసులపై చింతమనేని ఫైర్

ఇదిలావుంటే 2014 సాధారణ ఎన్నికల సమయంలో టిడిపికి పవన్ కల్యాణ్ మద్దుతిచ్చారు. కానీ ఆ తర్వాత ప్రత్యేకంగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ టిడిపిని దూరం పెట్టారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు వచ్చే ఎన్నికల్లో మళ్లీ కలిసి పనిచేయాలని టిడిపి-జనసేన పెద్దలు అభిప్రాయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికలోనూ అంచనాలకందని విజయాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆ వైసిపి పార్టీని ఒంటరిగా ఎదుర్కొని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కంటే కలిసి బరిలోకి దిగాలని రెండు పార్టీలు భావిస్తున్నాయట. అంతేకాదు ప్రతిపక్షాలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చి వైసిపిని ఓడించాలని రెండు పార్టీలు చూస్తున్నాయి. 

ఇప్పటికే జనసేన, బిజెపి ఏపీలో కలిసి పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో టిడిపి కూడా వారితో కలిసేందుకు సిద్దంగా వున్నట్లు రాజకీయ పరిణామాలను బట్టి అర్థమవుతుంది. 2014లో మాదిరిగా ఈ మూడు పార్టీలు కలిసి పనిచేసి వైసిపిని ఓడించాలని చూస్తున్నాయట. 

read more  విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం... వైసిపితో కలిసి నడిచేందుకు సిద్దమే..: పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

ఇలాంటి సమయంలో గుంటూరు జిల్లాలో టిడిపి-జనసేన పార్టీల మధ్య గుంటూరు జిల్లాలో ఘర్షణవాతావరణం నెలకొనడంపై ప్రాదాన్యతను సంతరించుకుంది. ఏకంగా టిడిపి చీఫ్ చంద్రబాబు తర్వాతి స్థానంలో వున్న ఆయన తనయుడు లోకేష్ ను జనసేన శ్రేణులు అడ్డుకోవడంతో దుమారం రేపుతోంది. ఈ పరిణామాల తర్వాత రాజకీయ సమీకరణలు ఎలా మారతాయో చూడాలి.  

ఇదిలావుంటే నారా లోకేష్ గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ అక్కడి ప్ర‌జా స‌మ‌స్య‌లు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను ప్ర‌స్తావిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై  విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ క్రమంలో సీఎం జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. జ‌గ‌న్ రెడ్డి పాల‌న నియంత పాల‌న‌కు నిద‌ర్శ‌నమంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ య‌ల్ల‌పు సంతోష్ భార్య నిండు గ‌ర్భిణి కాగా... ఆమెను డెలివరీ కోసం ఆస్ప‌త్రిలో చేర్చారు. అయితే సంతోష్‌ను పోలీసులు ఆస్పత్రిలోనే అదుపులోకి తీసుకోవ‌డంపై నారా లోకేష్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు.   ఉగ్ర‌వాదిలాగా సీఐడీ పోలీసులు(Crime Investigation Department)  సంతోష్‌ను అరెస్టు  చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. క‌నీసం నోటీసు ఇవ్వ‌కుండా, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఫాలో అవ్వ‌కుండా.. వైసీపీ పెద్ద‌ల క‌ళ్ల‌లో ఆనందం చూసేందుకు సీఐడీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చాలా దారుణమంటూ లోకేష్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

 

click me!