పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టుకెక్కుతాం: పెద్దిరెడ్డి

By Siva KodatiFirst Published Jan 21, 2021, 3:36 PM IST
Highlights

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సుప్రీంకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేస్తామని ఆయన వెల్లడించారు. నిమ్మగడ్డ, చంద్రబాబు కలిసి చేస్తోన్న కుట్రగా ఆయన ఆరోపించారు. 

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సుప్రీంకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేస్తామని ఆయన వెల్లడించారు.

నిమ్మగడ్డ, చంద్రబాబు కలిసి చేస్తోన్న కుట్రగా ఆయన ఆరోపించారు. అధికారులతో ఎస్ఈసీ సమావేశం పెట్టుకోవచ్చని.. ఇందులో తమకేం అభ్యంతరం లేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

Also Read:స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు: పేర్నినాని

తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానం తీర్పును తప్పుబట్టలేమన్న పెద్దిరెడ్డి.. ప్రభుత్వ యంత్రాంగానికి ఒకేసారి రెండు పనులు చేయడం కుదరదని తెలిపారు.

సుప్రీం తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటామని పెద్దిరెద్ది వెల్లడించారు. తాను పదవిలోంచి దిగిపోయేలోగా ఎన్నికలు నిర్వహించి చంద్రబాబుకు మేలు చేకూర్చాలని నిమ్మగడ్డ భావిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలో చంద్రబాబు, నిమ్మగడ్డలతో పాటు వారి కుల పెద్దలంతా ఉన్నారంటూ రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

click me!