నేనేమైనా దొంగనా.. ఇంటికొచ్చి తలుపులు బాదుతున్నారు: పోలీసులపై వీర్రాజు ఫైర్

By Siva KodatiFirst Published Jan 21, 2021, 3:00 PM IST
Highlights

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఇంతమంది పోలీసులు తన ఇంటికి ఎందుకు వచ్చారంటూ ఆయన మండిపడ్డారు. ఓ అద్దె ఇంట్లో ఉంటున్నానని.. అంతమంది వచ్చి ఇబ్బంది పెడతారా అని వీర్రాజు ఆగ్రహం  వ్యక్తం చేశారు

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఇంతమంది పోలీసులు తన ఇంటికి ఎందుకు వచ్చారంటూ ఆయన మండిపడ్డారు. ఓ అద్దె ఇంట్లో ఉంటున్నానని.. అంతమంది వచ్చి ఇబ్బంది పెడతారా అని వీర్రాజు ఆగ్రహం  వ్యక్తం చేశారు.

నేనేమన్నా దొంగనా.. పోలీసులు తలుపులు కొడుతున్నారని, ఏపీలో ప్రభుత్వం ఉందా..? ఎమర్జెన్సీ ఉందా అని సోము దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని వీర్రాజు ఆరోపించారు.

పడిపోయిన దేవాలయాల గురించి పోస్టులు పెడితే కేసులు పెట్టారని... ముందు రాజకీయ పార్టీల ప్రమేయం లేదని, ఆ తర్వాత పార్టీల పేర్లు చెప్పారని ఆయన ధ్వజమెత్తారు.

దేవాలయాలపై దాడులకు నిరసనగానే రథయాత్ర చేపట్టామని వీర్రాజు స్పష్టం చేశారు.  బీజేపీ కార్యకర్తలు ధ్వంసం ఘటనల్లో ఉన్నారా లేదా తేల్చాలని, తన ప్రకటనపై డీజీపీ వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 

కాగా విజయవాడతో  పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బీజేపీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. విజయవాడలోని సోము వీర్రాజు నివాసం వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఆయన బయటకి రాకుండా అడ్డుకున్నారు. అలాగే ఎంపీ సీఎం రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని గన్నవరం ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. 

డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో పోలీసులు ఎక్కడిక్కకడ హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బెంజి సర్కిల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ఉండటంతో బీజేపీ నేతలను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

click me!