ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.
అమరావతి: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది.దీంతో ఎన్నికల నిర్వహణకు గాను ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
అయితే ఎన్నికల నిర్వహణతో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. లక్షలాది పీపీఈ కిట్స్ ను ఎక్కడి నుండి తెస్తారని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం కమిషనర్ వ్యవహరశైలిని ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. ఎస్ఈసీని రాజ్ భవన్ కి పిలిపించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.
ఉద్యోగుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని వారు కోరుతున్నారు.