నెల్లూరు జిల్లాలో నెలకొన్న పరిస్థితులను మేకపాటి వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకెళ్లారు. ఆళ్ల నానితో ఫోన్ లో మాట్లాడిన గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా పరిస్థితిపై ప్రత్యేకంగా చర్చించారు.
అమరావతి: నెల్లూరు జిల్లాలో కరోనా సోకినవారికి పడకలు కూడా దొరకని పరిస్థితి వుందని మంత్రి గౌతమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నా నెల్లూరులో మరింత దారుణంగా వుందన్నారు. నెల్లూరు జిల్లాలో నెలకొన్న పరిస్థితులను మేకపాటి వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకెళ్లారు. ఆళ్ల నానితో ఫోన్ లో మాట్లాడిన గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా పరిస్థితిపై ప్రత్యేకంగా చర్చించారు.
పెరుగుతున్న కేసులు, మరణాలు, ఆక్సిజన్ నిల్వలు, రోగులకు బెడ్లు, వందశాతం వాక్సినేషన్ పై మంత్రులిద్దరు చర్చించుకున్నారు. కరోనా రోగులకు వసతుల కల్పనపై ప్రత్యేక చర్యలు చేపట్టి నెల్లూరు జిల్లాలో ప్రమాద పరిస్థితులను చక్కదిద్దాలని మేకపాటి కోరారు. ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెడ్ల సంఖ్యను పెంచాలని మేకపాటి సూచించారు. జిల్లాలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం నిర్వహించేలా చూడాలని వైద్యశాఖ మంత్రిని మేకపాటి కోరారు.
undefined
read more ప్రపంచంలో ఎక్కడాలేనంత పాజిటివ్ రేట్ నెల్లూరులోనే... ఎంతంటే..: సోమిరెడ్డి ఆందోళన (వీడియో)
నెల్లూరు జిల్లా కలెక్టర్ సహా జిల్లా అధికార యంత్రాంగంతో శుక్రవారం పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. కోవిడ్ నియంత్రణ కోసం తీసుకునే చర్యల నిమిత్తం ఏర్పాటైన ఐదుగురు మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో రేపు మంగళగిరిలో జరగబోయే సమావేశంలో నెల్లూరు జిల్లా పరిస్థితిని , తీవ్రతని ప్రధాన ఎజెండాగా తీసుకోవాలని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.