ఏపీలో ప్రమాద ఘంటికలు: ఒక్కరోజులో 9,716 కేసులు.. పెరుగుతున్న మరణాలు, యాక్టీవ్ కేసులు

Siva Kodati |  
Published : Apr 21, 2021, 06:41 PM IST
ఏపీలో ప్రమాద ఘంటికలు: ఒక్కరోజులో 9,716 కేసులు.. పెరుగుతున్న మరణాలు, యాక్టీవ్ కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. ఏ రోజుకారోజు కొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా తీవ్రత అధికంగా వున్న మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్ రాష్ట్రాలతో ఏపీ పోటీ పడేందుకు సిద్ధంగా వున్నట్లుగా అనిపిస్తోంది

ఆంధ్రప్రదేశ్ కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. ఏ రోజుకారోజు కొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా తీవ్రత అధికంగా వున్న మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్ రాష్ట్రాలతో ఏపీ పోటీ పడేందుకు సిద్ధంగా వున్నట్లుగా అనిపిస్తోంది.

రోజువారీ కేసులు పది వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,716 మందికి పాజిటివ్ తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల  సంఖ్య 9,86,703కి చేరింది.

నిన్న ఒక్కరోజు కోవిడ్ వల్ల 38 మంది మృత్యువాత పడ్డారు. దీంతో వైరస్ బారినపడి రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,510కి చేరింది. నిన్న కృష్ణా జిల్లాలో 10, నెల్లూరు 7, తూర్పుగోదావరి 4, శ్రీకాకుళం 4, చిత్తూరు 3, ప్రకాశం 3, గుంటూరు 2, కర్నూలు 2, విశాఖపట్నం 2, అనంతపురంలలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

గడిచిన 24 గంటల్లో 3,359 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,18,985కి చేరుకున్నాయి. నిన్న 39,619 మంది శాంపిల్స్ పరీక్షంచగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా టెస్టుల సంఖ్య 1,57,93,298కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో అనంతపురం 849, చిత్తూరు 1,180, తూర్పుగోదావరి 830, గుంటూరు 1,236, కడప 216, కృష్ణా 294, కర్నూలు 958, నెల్లూరు 934, ప్రకాశం 294, శ్రీకాకుళం 1,444, విశాఖపట్నం 810, విజయనగరం 565, పశ్చిమ గోదావరిలలో 106 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu