వైసీపీ ఎంపీలపై లోకేష్ ఘాటు విమర్శ

First Published 16, Jul 2018, 3:21 PM IST
Highlights

విపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై మీడియా ఎదుట చర్చకు సిద్ధమని మంత్రి సవాల్ చేశారు. 
 

వైసీపీ ఎంపీలపై మంత్రి లోకేష్ ఘాటు విమర్శలు చేశారు.  ప్రత్యేక హోదా సాధన నేపథ్యంలో వైసీపీ ఎంపీలంతా ముకుమ్మడిగా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. వారంతా ఇప్పుడు రాజీనామాలు చేసి  ఇంట్లో ఖాళీగా కూర్చున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు.

ఇప్పుడు ఆ ఎంపీలంతా రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడం లేదని ఆరోపించారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. అమరావతి అంతర్జాతీయ క్రియేటివిటీ సెంటర్‌గా ఎదగాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. విపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై మీడియా ఎదుట చర్చకు సిద్ధమని మంత్రి సవాల్ చేశారు. 

ప్రత్యేకహోదా ఇవ్వని ప్రధాని మోదీని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత, జగన్‌ ఎందుకు విమర్శించడంలేదని లోకేష్ ప్రశ్నించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరోసారి కేంద్రంపై అవిశ్వాసం పెడతామన్నారు

Last Updated 16, Jul 2018, 3:26 PM IST