కేంద్రానికి బానిసలం కాదు, ట్యాక్స్ కడుతున్నాం: బాబు సంచలనం

First Published Jul 16, 2018, 1:57 PM IST
Highlights

 కేంద్రానికి మనం  బానిసలం కాదని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  తేల్చి చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయనుందునే కేంద్రం నుండి బయటకు రావాల్సి వచ్చిందని  చంద్రబాబునాయుడు స్పష్టత ఇచ్చారు. 

గుంటూరు: కేంద్రానికి మనం  బానిసలం కాదని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  తేల్చి చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయనుందునే కేంద్రం నుండి బయటకు రావాల్సి వచ్చిందని  చంద్రబాబునాయుడు స్పష్టత ఇచ్చారు. 

 సోమవారం నాడు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  గుంటూరు జిల్లాలో పర్యటించారు. గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో  సోమవారం నాడు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. మేమూరు నియోజకవర్గంలో పోతార్లంక గ్రామంలో ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించారు.  ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 10 లంక గ్రామాల్లోని 6 వేల ఎకరాలకు సాగునీరు  లభ్యం కానుంది.

కృష్ణా నుండి నీళ్లు రాకున్నా  పట్టి సీమ ద్వారా పంటకు  నీరిస్తున్నట్టు ఆయన చెప్పారు. కేంద్రానికి  బానిసలం కాదన్నారు.  కేంద్రానికి  రాష్ట్రం నుండి ట్యాక్సులను  కడుతున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. 

రాష్ట్రానికి సహాయం అందించకుండా ఉన్నందుకే   కేంద్రం నుండి వైదొలగాల్సి వచ్చిందని  చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రానికి దక్కాల్సిన హక్కుల కోసం  కేంద్రం పై పోరాటం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 

పోలవరం ప్రాజెక్టును ఏడాదిలోపుగా పూర్తి చేస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు అనేక కుట్రలు పన్నుతారని  చంద్రబాబునాయుడు ఆరోపించారు. మీ కోసం ఇంత చేస్తున్నా మీరంతా  తనకు సహకరించాలని ఆయన కోరారు.
 

click me!