ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

By ramya neerukondaFirst Published Dec 6, 2018, 4:00 PM IST
Highlights

ఏపీలో నిరుద్యోగులకు మంత్రి కొల్లు రవీంద్ర మరో గుడ్ న్యూస్ తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతితో పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. 

ఏపీలో నిరుద్యోగులకు మంత్రి కొల్లు రవీంద్ర మరో గుడ్ న్యూస్ తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతితో పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర అధికారికంగా ప్రకటించారు.

గురువారం రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద రూ.4లక్షలకు పైగా అర్హులకు ప్రతి నెలా రూ.వెయ్యి నిరుద్యోగ భృతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షల 74వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

నిరుద్యోగ భృతి అందుకుంటున్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.  ఈ నెల 10వ తేదీ నుంచి 555 కేంద్రాల్లో సిల్క్ డెవలప్ మెంట్  శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. దీని కోసం రూ.24 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ పొందాలనుకునే నిరుద్యోగులంతా ముఖ్య మంత్రి యువనేస్తం పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారికి ఏ విభాగంలో ఆసక్తి అంటే అందులో ట్రైనింగ్ ఇస్తామని మంత్రి వివరించారు. 

click me!