అటవీశాఖలో ఖాళీల భర్తీకి ఎపిపిఎస్సీ రెడీ... నోటిఫికేషన్ జారీ

Published : Dec 06, 2018, 02:51 PM IST
అటవీశాఖలో ఖాళీల భర్తీకి ఎపిపిఎస్సీ రెడీ... నోటిఫికేషన్ జారీ

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ఎపిపిఎస్సి మరో తీపి కబురు అందించింది. అటవీశాఖలో ఖాళీగా వున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 24 ఎఫ్ఆర్‌వో పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తెలిపింది. 

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ఎపిపిఎస్సి మరో తీపి కబురు అందించింది. అటవీశాఖలో ఖాళీగా వున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 24 ఎఫ్ఆర్‌వో పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటించింది.

ఈ ఉద్యోగాల కోసం అర్హత గల అభర్థులు ఈ నెల 10 నుండి 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. బ్యాచిలర్ డిగ్రీతో పాటు తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. జనరల్ అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లుగా నిర్ధారించగా.... ఎస్సీ, ఎస్టీ, బిసిలకు మరో ఐదేళ్ల వయసు సడలించారు. 

ఇక ఉద్యోగాల భర్తీ ప్రక్రియ షెడ్యూల్ ను కూడా ఎపిపిఎస్సీ ప్రకటించింది. ఫిబ్రవరి 24 న స్క్రీనింగ్ పరీక్ష, ఎప్రిల్ 28 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే దరఖాస్తులు 25 వేలకు మించి వస్తేనే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని...అంతకంటే తక్కువగా వస్తే స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా నేరుగా మెయిన్స్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దేహదారుడ్య పరీక్ష కూడా ఉండనుంది.. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు
Bhumana Karunakar Reddy: కూటమి పాలనలో దిగ‌జారుతున్న తిరుమ‌ల ప్ర‌తిష్ట | TTD | Asianet News Telugu