నంద్యాలలో రూ.200కోట్ల కలకలం.. అధికారుల తనిఖీలు

By ramya neerukondaFirst Published Dec 6, 2018, 2:29 PM IST
Highlights

కర్నూలు జిల్లా నంద్యాలలో రూ.200కోట్ల కలకలం రేగింది. నంద్యాల మండలం పెద్దకొట్టాల ఆశ్రమంలోని ఓ ఇంట్లో రూ.200కోట్లు అక్రమంగా దాచి పెట్టారంటూ డీఎస్పీ గోపాలకృష్ణ కి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.

కర్నూలు జిల్లా నంద్యాలలో రూ.200కోట్ల కలకలం రేగింది. నంద్యాల మండలం పెద్దకొట్టాల ఆశ్రమంలోని ఓ ఇంట్లో రూ.200కోట్లు అక్రమంగా దాచి పెట్టారంటూ డీఎస్పీ గోపాలకృష్ణ కి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.

దీంతో.. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.   అర్బన్‌ సీఐ రవిశంకర్‌రెడ్డి, సిబ్బంది, రెవెన్యూ అధికారులు పెద్దకొట్టాలకు  చేరుకొని తనిఖీలు నిర్వహించారు. దీంతో  గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.  అయితే ఆ ఇంట్లో సోదాలు చేపట్టగా ఒక్కరూపాయి కూడా దొరకకపోవడంతో అధికారులు వెనుదిరిగారు.  అయితే..కావాలని ఆకతాయి ఫోన్ చేసి ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చాడని అధికారులు తెలిపారు. కాగా.. ఫోన్ చేసిన ఆకతాయిని అరెస్టు చేస్తామని అధికారులు చెప్పారు. 

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయిన తర్వాత.. తెలంగాణలోనూ ఇలాంటి ఫేక్ కాల్స్ రావడం జరిగింది. అధికారులు తనిఖీల అనంతరం డబ్బు లేదని తేలిన తర్వాత.. ఫేక్ కాల్స్ చేసిన వారిపై చర్యలు కూడా తీసుకున్నారు. ఇదే ఘటన ఇప్పుడు నంద్యాలలో చోటుచేసుకుంది.

click me!