ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే జైలుకే: వ్యవసాయ మంత్రి హెచ్చరిక

By Arun Kumar PFirst Published Sep 1, 2020, 9:00 PM IST
Highlights

రాష్ట్రంలో అవసరానికి మించి ఎరువులు అందుబాటులో ఉన్నాయని... కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. 

విజయవాడ: ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు బాగా పడుతున్నాయని... దీంతో రిజర్వాయర్లు అన్ని నిండాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్రానికి 
ఎంత అవసరమో అంత వర్షపాతం ఉందని... కరవు పీడిత ప్రాంతాలు అయిన అనంతపురంలోనూ 330.2మిల్లీ మీటర్ల వర్షం కురిసిందన్నారు.

''వర్షాలు సమృద్దిగా వుండటంతో రాష్ట్రవ్యాప్తంగా 37,47,761 హెక్టార్లలో నాట్లు పడాల్సి ఉండగా ఇప్పటికే  29,39,698 హెక్టార్లలో నాట్లు పడ్డాయి.  రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచడానికి 5,50,700 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికే 5,34,895 మెట్రిక్ టన్నులు అందించాం.ఇంకా 2,16,340 మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉంది. అంటే అవసరానికి మించి ఎరువులు అందుబాటులో ఉంది'' అని వెల్లడించారు.  

''ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జైళ్ళకు పంపించడానికి కూడా వెనుకాడం. కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది కల్గించకుండా ఎరువులను అందించాలి'' అని మంత్రి ఆదేశించారు.

read more  యువతకు వాటిపైనా శిక్షణ ఇవ్వండి...: నైపుణ్యాభివృద్దిపై సమీక్షలో సీఎం

''ఎన్ఆర్జీఎస్ క్రింద రైతు భరోసా కేంద్ర భవనాలు డిసెంబరు నాటికి పూర్తవుతాయి. నెల్లూరు జిల్లాలో ధాన్యం పుట్టు ధాన్యానికి వేర్వేరు రూపాలలో తీసుకుంటున్నారని తెలిసి జెసీని చర్యలకు ఆదేశించాం'' అని తెలిపారు. 

''ఈ-క్రాప్ బేస్ లో రైతుకు సంబంధించిన అన్ని సదుపాయాలు ఇస్తాం. రైతులతో సంఘాలను ఏర్పాటు చేసి పరికరాలను ఇస్తాం. కష్టమ్ హైరింగ్ లో రైతుభరోసా కేంద్రాలు ముందుగా పనిచేస్తాయి. రైతుకు ఆ ప్రాంతంలో ఏ పరికరాలు అవసరమో అవే అందుబాటులో ఉండేలా చూస్తాం'' అన్నారు.

''సీఎం జగన్ చేతుల మీదుగా అక్టోబర్ 2న యంత్ర సహాయం చేసే కార్యక్రమం ప్రారంభిస్తాం. విలేజ్ సీడ్ కార్యక్రమం బలోపేతం చేయడంలో యూనివర్శిటీలను భాగస్వామ్యం చేస్తాం. 2020 ఖరీఫ్ లో 41,231కోట్ల రుణాలు రైతులకు ఇచ్చాం. పాల సేకరణ కూడా రైతు స్ధాయిలో చేయడానికి అమూల్ ద్వారా చేసేందుకు ఏర్పాటు చేసాం. కరోనా కష్టకాలంలోనూ వైఎస్ఆర్ రైతుభరోసా, సున్న వడ్డీ, పీఎం కిసాన్ సురక్ష పధకాలు అమలు చేస్తున్నాం'' అని మంత్రి కన్నబాబు వెల్లడించారు. 


 

click me!