
ఎపీకి రెవిన్యూ లోటు గురించి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కు తెలియదట. రెవిన్యూ లోటు 16 వేల కోట్ల రూపాయలు ఎపీకి రావాలని బాబు మూడు సంవత్సరాలుగా చెబుతున్నారు. అయితే తాజాగా రాజ్యసభలో జరిగిన చర్చలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ మేగ్వాల్ ఎపీలో ఉన్న రెవిన్యూ లోటు పై వివరణ ఇచ్చారు. ఏపీకి రెవిన్యూ లోటు 4117 కోట్లు మాత్రమే అని తెల్చీచెప్పారు. అందులో సగం ఇప్పటికే ఎపీకి అందించామని, మిగతా సగం త్వరలో ఇస్తామని తెలిపారు.
అయితే ఎపీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాటలు మాత్రం మరో రకంగా ఉన్నాయి. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే చాలా చేసిందని ఆయన అన్నారు. ఏపీలో రెవెన్యూ లోటు రూ.4117 కోట్లేనని కేంద్రం అన్న విషయం తనకు తెలియదన్నారు. కేంద్ర సహకారం లేకుండా ఏపీ అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. ఏపీ లో రెవెన్యూ లోటు 16 వేల కోట్లు భర్తీ చేయాలని కోరారు. కేంద్రం మాత్రం ఎపీలో రెవిన్యూ లోటు 4117 కోట్లని ప్రకటిస్తే, మంత్రి కామినేని మాత్రం 16 కోట్ల లోటును తీర్చాలని మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
మంత్రి కామినేని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న మెడిటెక్ కుంభకోణం గురించి వివరణ ఇచ్చారు. విశాఖ మెడిటెక్ పార్కులో అస్సలు అవినీతి జరగలేదని మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రతి పక్షాలు కావాలనే అవినీతి జరిగనట్లు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. కానీ గత వారం రోజుల క్రితం మెడ్ టెక్ లో పని చేసిన ఉన్నతాధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మెడ్‌టెక్ లో మంత్రి నుండి అధికారుల వరకు భారీగా అవినీతి జరిగిందని తెలిపిన విషయం తెలిసిందే.