
వైసీపి శ్రేణుల్లో ఉత్సహం ఉరకలేస్తుంది. కారణం నేడు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల్లో ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభించనున్నారు. జిల్లా నలుమూలల నుండి ఇప్పటికే వైసీపి శ్రేణులు నంద్యాలకు చేరుకున్నారు. జగన్ బుదవారం ఒంటి గంట నుండి ఆయన ప్రచారం ప్రారంభం అవుతుంది. జగన్ వారం రెండు వారాల పాటు నద్యాల ప్రచారంలో పాల్గోంటారు. మొదటి విడతగా మూడురోజుల (9, 10, 11 తేదీల్లో) పాటు ఆయన ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
జగన్ 12 గంటలకు నంద్యాలకు చేరుకుంటారు. మొదట నంద్యాల మండలం రైతునగరంలో తన ప్రచారం ప్రారంభిస్తారు. అక్కడ దాదాపుగ గంట పాటు ప్రజలను కలిసి మాట్లాడుతారు. 2 గంటలకు అక్కడి నుంచి రామకృష్ణానగర్, కానాల, హైస్కూల్ కొట్టాల, అనంతరం గోస్పాడు మండలంలోని ఎం.చింతకుంట్ల, జూలేపల్లి, పసురపాడు, తేళ్లపురి గ్రామాల్లో రోడ్‌షో నిర్వహిస్తారని వివరించారు. సాయంత్రం 8 గంటల వరకు ముగియనుంది.