వివాహేతర సంబంధం : ప్రియుడితో కలిసి భర్తను చంపి.. మామిడితోటలో కాల్చేసి, సగం కాలిన శవాన్ని పూడ్చిన భార్య...

Published : Feb 03, 2023, 09:58 AM IST
వివాహేతర సంబంధం :  ప్రియుడితో కలిసి భర్తను చంపి.. మామిడితోటలో కాల్చేసి, సగం కాలిన శవాన్ని పూడ్చిన  భార్య...

సారాంశం

ఓ భార్య భర్తను అతి పాశవికంగా హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హతమార్చింది. ఆ తరువాత పెట్రోల్ పోసి తగలబెట్టింది. 

ఏలూరు : ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఓ వ్యక్తి అదృశ్యం కేసు హత్యతో అంతమయ్యింది. ఇసుక తోలడానికి వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండాపోయాడు. ఆ  తర్వాత అతను హత్యకు గురయ్యాడని తేలింది. ఈ ఘటన ఏలూరులో సంచలనం సృష్టించింది. రాయపాటి రాటాలు అలియాస్ కాశి (36) అనే వ్యక్తి  జనవరి 3వ తేదీ కనిపించకుండా పోయాడు. ముసునూరు మండలంలోని యల్లాపురానికి చెందిన కాశి ఆరోజు తన వ్యాన్ లో ఇసుకలోడు తీసుకుని బయలుదేరాడు.  

రమణక్కపేటలో  ఇసుకను అమ్ముకుని వస్తానని చెప్పాడు. అయితే అలా వెళ్ళిన వ్యక్తి తెల్లారిన తర్వాత కూడా ఇంటికి తిరిగి రాలేదు.  దీంతో కాశీ తండ్రి సత్యనారాయణ ముసునూరు పోలీస్ స్టేషన్లో కొడుకు అదృశ్యం మీద ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితులు అతడిని హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. షాకింగ్ విషయం ఏంటంటే నిందితుల్లో మృతుని భార్య ఉండడం. 

సహాయం చేస్తానని భర్త చనిపోయిన మహిళతో వివాహేతర సంబంధం.. లాడ్జీకి తీసుకువెళ్లి...

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడుతో కలిసి భార్య హత్య చేయించినట్లు తెలిసింది. జనవరి మూడవ తేదీన రమణక్కపేటకు ఇసుకలోడుతో వెళ్లిన కాశి..  రాత్రివేళ తిరిగి వస్తుండగా అతడిని హతమార్చారు. అతని భార్య, ప్రియుడు మరో ముగ్గురుతో కలిసి అతని మీద దాడి చేశారు. సూరేపల్లి మామిడి తోటలోకి తీసుకువెళ్లి చంపేశారు. అక్కడి నుంచి అతడి మృతదేహాన్ని లోపూడి అడవిలోకి తీసుకువెళ్లి ఎవరికి తెలియకుండా దహనం చేశారు. 

ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అనుమానంతో మళ్లీ వెళ్లి చూడగా శవం పూర్తిగా కాలలేదని అర్థమయ్యింది. దీంతో  సగం కాలిన ఆ శవాన్ని తమ వ్యాన్లో వేసుకుని యల్లాపురం గ్రామానికి వచ్చారు. ఆ తరువాత గ్రామ సమీపంలోని తమ్మిలేరులో పాతిపెట్టినట్లుగా సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu